NATS: ఫ్లోరిడాలో టాంపా బేలో 'నాట్స్' రిపబ్లిక్ డే పరేడ్

ABN , First Publish Date - 2023-02-02T10:38:16+05:30 IST

అమెరికాలో అనేక సేవ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం 'నాట్స్' మరో కార్యక్రమాన్ని చేపట్టింది.

NATS: ఫ్లోరిడాలో టాంపా బేలో 'నాట్స్' రిపబ్లిక్ డే పరేడ్

ఫ్లోరిడా: అమెరికాలో అనేక సేవ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం 'నాట్స్' మరో కార్యక్రమాన్ని చేపట్టింది. ఫ్లోరిడాలోని టాంపా బేలో నాట్స్ విభాగం రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించింది. టాంపాలోని భారతీయ సాంస్కృతిక కేంద్రం(Indian Cultural Center)లో నాట్స్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆఫ్ టాంపా బే చేపట్టిన ఈ రిపబ్లిక్ డే పరేడ్ విజయవంతం అయింది. నాట్స్ సభ్యులు, తెలుగువారు చాలా మంది కలిసి రిపబ్లిక్ డే పరేడ్ విజయవంతం చేశారు. నాట్స్‌తో కలిసి ఎఫ్.ఐ.ఎ చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల మాతృభూమిపై మమకారాన్ని ప్రతిభింబించింది.

NNN.jpg

రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా చిన్నారుల్లో సృజనాత్మకత పెంచే పోటీలు కూడా నిర్వహించారు. నాట్స్ సభ్యులతో పాటు వారి పిల్లలు కూడా ఇందులో భాగస్వాములై రిపబ్లిక్ డే పరేడ్ విజయవంతం చేశారు. చిన్నారుల్లో సేవాభావాన్ని పెంపొందించడానికి, సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే నాట్స్, ఎప్.ఐ.ఎ సభ్యులు సూచనలు చేశారు. రిపబ్లిక్ డే పరేడ్ రోజు వివిధ సంస్థల ఐక్యత ఎంతగానో దోహదపడుతుందని 'నాట్స్' సంస్థ అభిప్రాయపడింది. నాట్స్, ఎఫ్.ఐ.ఎతో పాటు వివిధ సంస్థలు కలిసి జాతీయ జెండా ఎగురవేశారు.

NN.jpg

నాట్స్ చేపట్టిన రిపబ్లిక్ డే పరేడ్ విజయవంతం చేయడానికి రాజేష్ కాండ్రు, శ్రీనివాస్ బైరెడ్డి, సుధాకర్ మున్నంగి, భరత్ ముద్దన, బిందు బండ, భాను ధూళిపాళ్ల తదితరులు కీలక పాత్ర పోషించారు. ఈ రిపబ్లిక్ డే పరేడ్ కోసం తమ వంతు సహకారాన్ని అందించిన నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డా. కొత్త శేఖరం, బోర్డు వైస్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, బోర్డు ఆఫ్ డైరక్టర్ శ్రీనివాస్ మల్లాది తదితరులకు నాట్స్ టాంపా బే విభాగం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఫైనాన్స్/మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ భాను ధూళిపాళ్ల, ప్రోగ్రామ్స్ నేషనల్ కోఆర్డినేటర్ రాజేష్ కాండ్రు, జాయింట్ ట్రెజరర్ సుధీర్ మిక్కిలినేని, సలహామండలి సభ్యులు ప్రసాద్ ఆరికట్ల, సురేష్ బొజ్జా, చాప్టర్ కో ఆర్డినేటర్ సుమంత్ రామినేని, జాయింట్ కోఆర్డినేటర్ విజయ్ కట్టా, కోఆర్డినేటర్ కమిటీ చైర్స్ భరత్ ముద్దన, హరి మండవతో పాటు నాట్స్ వాలంటీర్‌లందరూ చక్కటి ప్రణాళికతో రిపబ్లిక్ డే పరేడ్ విజయవంతం చేశారు.

NNNN.jpg

భావితరంలో సేవాభావాన్ని నింపేందుకు రిపబ్లిక్ డే పరేడ్ చేపట్టి విజయవంతం చేసిన టాంపా బే నాట్స్ విభాగాన్ని నాట్స్ ఛైర్ విమెన్ అరుణగంటి ప్రత్యేకంగా అభినందించారు. సేవే గమ్యం నినాదానికి తగ్గట్టుగా టాంపాబే విభాగం రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించిందని నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి టాంపాబే నాయకులను ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన సెక్రటరీ రంజిత్ చాగంటి, ఎగ్జిక్యూటివ్ మీడియా సెక్రటరీ మురళీ మేడిచెర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2023-02-02T10:38:17+05:30 IST