Oman: ఒమాన్‌లో 7వేల మంది ప్రవాసులు అరెస్ట్.. కారణమిదే!

ABN , First Publish Date - 2023-06-06T08:22:05+05:30 IST

ఉల్లంఘనలకు పాల్పడే ప్రవాసులపై గల్ఫ్ దేశం ఒమాన్ ఉక్కుపాదం మోపుతోంది.

Oman: ఒమాన్‌లో 7వేల మంది ప్రవాసులు అరెస్ట్.. కారణమిదే!

మస్కట్: ఉల్లంఘనలకు పాల్పడే ప్రవాసులపై గల్ఫ్ దేశం ఒమాన్ ఉక్కుపాదం మోపుతోంది. గతకొంతకాలంగా కార్మిక మంత్రిత్వశాఖ, ఒమాన్ రాయల్ పోలీసులు (Royal Oman Police), విద్యా మంత్రిత్వ శాఖ (Ministry of Education) సంయుక్తంగా వరుస తనఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ సోదాల్లో భాగంగా 2023 జనవరి నుంచి ఇప్పటివరకు ఏకంగా 7000 మంది వలసదారులను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కార్మిక మంత్రిత్వ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్స్పెక్షన్ నాసర్ బిన్ సలేం అల్ హద్రామి (Nasser bin Salem Al Hadrami) మాట్లాడుతూ.. మంత్రిత్వ శాఖ ఒమాన్‌లోని (Oman)అన్ని కార్మిక సంక్షేమ శాఖలలో సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. దీనిలో భాగంగా తనిఖీ బృందం కార్మికుల పని గంటలతో పాటు మహిళలు, యువకుల ఉపాధి, కార్మికుల ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన ప్రతిదాన్ని పరిగణనలోకి తీసుకుంటుందని ఆయన తెలిపారు. అలాగే యజమానులు, కార్మికులకు అవగాహన కల్పించడం చేస్తోందని చెప్పారు.

ఇక ముందస్తు నోటిఫికేషన్ లేకుండా ఏదైనా కార్యాలయంలోకి ప్రవేశించే హక్కు తనిఖీ బృందానికి ఉందని చట్టం చెబుతుందన్నారు. కార్మిక చట్టంలోని ఆర్టికల్ 9లో పేర్కొన్న విధంగా యజమానులు అవసరమైన మొత్తం డేటాను అందిచాల్సి ఉంటుందని అల్ హద్రామి స్పష్టం చేశారు. కాగా, కార్మికుడి పనిని యజమాని లేదా అతని ప్రతినిధి అడ్డుకుంటే.. కార్మిక చట్టంలోని ఆర్టికల్ 112 ప్రకారం యజమానికి ఒమనీ రియాళ్లు (రూ.1.07లక్షలు) కు మించని జరిమానా లేదా ఒక నెలకు మించని జైలు శిక్ష విధించబడుతుందని తెలిపారు.

Indian Priest: సింగపూర్‌లో భారతీయ పూజారి బాగోతం.. డబ్బు కావాల్సినప్పుడల్లా ఏం చేశాడంటే..

ఇక గతేడాది చేపట్టిన మొత్తం 12,045 తనిఖీల ద్వారా 17వేల మంది ప్రవాస కార్మికులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అలాగే పనిచేసే చోట నుంచి 27,954 మంది కార్మికులు పారిపోయినట్లు గుర్తించామన్నారు. 2022లో మొత్తంగా కార్మిక ఫిర్యాదుల సంఖ్య 66,469కి చేరిందన్నారు.

US: సముద్రంలో మునిగిపోతున్న కొడుకుని కాపాడే ప్రయత్నంలో.. ప్రాణాలు కోల్పోయిన తెలుగు ఎన్నారై


Updated Date - 2023-06-06T08:22:05+05:30 IST