NRI: భారతీయ అమెరికన్ వైద్యుడికి యూఎస్‌లో కీలక పదవి.. ఎవరీ డా. బిమల్‌జీత్ సింగ్..?

ABN , First Publish Date - 2023-07-20T08:30:12+05:30 IST

భారతీయ అమెరికన్ (Indian-American), గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ (Gastroenterologist) డా. బిమల్‌జీత్ సింగ్ సంధుకు (Dr Bimaljit Singh Sandhu) అమెరికాలో కీలక పదవి దక్కింది.

NRI: భారతీయ అమెరికన్ వైద్యుడికి యూఎస్‌లో కీలక పదవి.. ఎవరీ డా. బిమల్‌జీత్ సింగ్..?

NRI: భారతీయ అమెరికన్ (Indian-American), గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ (Gastroenterologist) డా. బిమల్‌జీత్ సింగ్ సంధుకు (Dr Bimaljit Singh Sandhu) అమెరికాలో కీలక పదవి దక్కింది. వర్జీనియా గవర్నర్ గ్లెన్ యంగ్‌కిన్ (Virginia Governor Glenn Youngkin).. సింగ్‌ను వర్జీనియా కామన్‌వెల్త్ యూనివర్సిటీ హెల్త్ సిస్టమ్ అథారిటీ బోర్డు సభ్యునిగా నియమిస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం బిమల్‌జీత్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఈ పదవిలో ఆయన వర్జీనియా స్టేట్ హెల్త్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో కీలక భూమిక పోషించనున్నారు. వర్జీనియాలో ఆరోగ్య వ్యవస్థ, మెడ్ స్కూల్, నర్సింగ్ స్కూల్, ఫార్మసీ స్కూల్ కార్యకలాపాలను పర్యవేక్షించడం ఈ బోర్డు డైరెక్టర్ల ప్రధాన విధి.

Punjabi.jpg

ఇక తన నియామకంపై బిమల్‌జీత్ స్పందిస్తూ.. కీలక బాధ్యతలు దక్కడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తాము నిధుల సేకరణకు దిశానిర్దేశం చేస్తామని, వివిధ వైద్య కళాశాలలు, ఆస్పత్రులకు వ్యూహాత్మక మార్గనిర్దేశం చేస్తామన్నారు. తద్వారా వర్జీనియన్లకు ఉత్తమ సంరక్షణను అందిస్తామని బిమల్‌జీత్ చెప్పారు. పంజాబ్‌లోని (Punjab) ఫరీద్‌కోట్‌కు చెందిన డాక్టర్ బిమల్‌జిత్ సింగ్ సంధు 2004లో వర్జీనియా కామన్‌వెల్త్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌లో (Commonwealth University) గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ ఫ్యాకల్టీ మెంబర్‌గా అగ్రరాజ్యానికి వలస వచ్చారు.

Henley Passport Index 2023: మెరుగైన భారత పాస్‌పోర్ట్ ర్యాంక్.. ఎన్ని దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చంటే..


Updated Date - 2023-07-20T08:42:35+05:30 IST