Kuwait: కువైత్‌లోని ప్రవాసులకు హెచ్చరిక.. అలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలంటూ మినిస్ట్రీ వార్నింగ్..!

ABN , First Publish Date - 2023-07-15T12:15:14+05:30 IST

నకిలీ సందేశాలతో పాటు తెలియని వెబ్‌సైట్‌లతో జాగ్రత్తగా ఉండాలని కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖ (Ministry of Interior) హెచ్చరించింది.

Kuwait: కువైత్‌లోని ప్రవాసులకు హెచ్చరిక.. అలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలంటూ మినిస్ట్రీ వార్నింగ్..!

కువైత్ సిటీ: నకిలీ సందేశాలతో పాటు తెలియని వెబ్‌సైట్‌లతో జాగ్రత్తగా ఉండాలని కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖ (Ministry of Interior) హెచ్చరించింది. నకిలీ సందేశాలు లేదా తెలియని వెబ్‌సైట్స్ ట్రాఫిక్ ఉల్లంఘనలకు జరిమానాలు చెల్లించాలంటూ ప్రజలను మోసం చేస్తున్నాయని ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ గుర్తు చేసింది. ఈ మేరకు తన భద్రతా మీడియా, పబ్లిక్ రిలేషన్స్ విభాగం ద్వారా కీలక ప్రకటన విడుదల చేసింది. అలాగే గవర్నమెంట్ సర్వీస్ యాప్‌లోని సందేశాలను ప్రస్తావించిన మంత్రిత్వశాఖ.. ట్రాఫిక్ ఫైన్స్‌ను 'సహేల్' (Sahl) లో మాత్రమే చెల్లించాలని చెప్పుకొచ్చింది. దీనిలో భాగంగా ఇప్పటికే భద్రతా చర్యలను పూర్తి చేసినట్లు తెలిపింది. ఇలాంటి నకిలీ, తప్పుడు సందేశాల పట్ల నివాసితులు, ప్రవాసులు అప్రమత్తంగా ఉండాలని కోరింది. లేనిపక్షంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

ట్రాఫిక్ ఫైన్స్ (Traffic Fines) చెల్లించకుంటే భారీ జరిమానాలు ఉంటాయని మంత్రిత్వశాఖ సందేశాలు పంపించదని స్పష్టం చేసింది. తాము కేవలం అలర్ట్ మెసేజ్‌లు మాత్రమే పంపిస్తామని పేర్కొంది. అది కూడా ఉల్లంఘనదారులకు 'సహేల్' డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా మాత్రమే ఇలాంటి సందేశాలు పంపించడం జరుగుతుందని తెలియజేసింది. కాగా, కొందరు మోసగాళ్లు మినిస్ట్రీ అధికారిక వెబ్‌సైట్‌ను (Official Website) క్లోనింగ్ చేసి నకిలీ సైట్లను సృష్టించి ఇలాంటి తప్పుడు సందేశాలు పంపిస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇలాంటి సందేశాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇక ఏదైనా చెల్లింపులు చేసే ముందు కచ్చితంగా అది మినిస్ట్రీకి సంబంధించిన అధికారిక వెబ్‌సైటా? కాదా? అని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాతే పేమెంట్ చేయాలని ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ అధికారులు ప్రజలను సూచించారు.

Passport: విదేశీ పర్యటనకు పాస్‌పోర్ట్ అనేది తప్పనిసరి.. కానీ, ఈ ముగ్గురికి మాత్రం అది అవసరం లేదు.. వారెవరో తెలుసా..?

Updated Date - 2023-07-15T12:16:04+05:30 IST