Dubai: దుబాయి వాటర్ కెనాల్‌లో దూకేసిన వ్యక్తి.. తీరా కాపాడి ఆస్పత్రికి తీసుకెళ్తే షాకింగ్ విషయం చెప్పిన వైద్యులు.. ఫైన్ వేసిన కోర్టు!

ABN , First Publish Date - 2023-02-22T11:47:51+05:30 IST

దుబాయ్‌లో 34ఏళ్ల ఓ గల్ఫ్ దేశస్థుడు కొద్దిసేపు అధికారులను పరుగులు పెట్టించాడు.

Dubai: దుబాయి వాటర్ కెనాల్‌లో దూకేసిన వ్యక్తి.. తీరా కాపాడి ఆస్పత్రికి తీసుకెళ్తే షాకింగ్ విషయం చెప్పిన వైద్యులు.. ఫైన్ వేసిన కోర్టు!

దుబాయ్: దుబాయ్‌లో 34ఏళ్ల ఓ గల్ఫ్ దేశస్థుడు కొద్దిసేపు అధికారులను పరుగులు పెట్టించాడు. ఉన్నట్టుండి దుబాయ్ వాటర్ కెనాల్‌లో (Dubai Water Canal) దూకేశాడు. దాంతో అక్కడే ఉన్న మెరైన్ రెస్క్యూ పెట్రోల్ సిబ్బంది అతడిని కాపాడి ఒడ్డుకు చేర్చింది. అనంతరం చికిత్స నిమిత్తం అధికారులు ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడ అతడిని పరీక్షించిన వైద్యులకు షాకింగ్ విషయం తెలిసింది. సదరు వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. ఆ మత్తులోనే అతడు ఇలా కెనాల్‌లో దూకేశాడని తేల్చారు. ఇక క్రిమినల్ లేబొరేటరీ నివేదిక ప్రకారం.. ఫెడరల్ చట్టంలోని డ్రగ్ షెడ్యూల్ నంబర్ 5, 8లో జాబితా చేయబడిన మత్తుపదార్థాలను ఆ వ్యక్తి వినియోగించినట్లు నిర్ధారించారు.

అయితే, పోలీసుల విచారణలో అతడు సైకోట్రోపిక్ పదార్థాలను వినియోగించినట్లు అంగీకరించినప్పటికీ, కోర్టులో మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను తిరస్కరించాడు. మానసిక వ్యాధికి చికిత్స నేపథ్యంలోనే వాటిని తీసుకున్నట్లు చెప్పాడు. కానీ, ఆ తర్వాత న్యాయస్థానంలో అతడు తన వాదనను నిరూపించలేపోయాడు. దీంతో ఆ వ్యక్తిని న్యాయస్థానం దోషిగా తేల్చింది. 5వేల దిర్హమ్స్ జరిమానా విధించింది. అలాగే అతడి బ్యాంకింగ్ లావాదేవీలను దుబాయ్ మిస్డిమినర్, ఉల్లంఘనల కోర్టు రెండేళ్లపాటు బ్యాన్ చేసింది. ఈ ఘటన దుబాయిలో కలకలం రేపింది.

ఇది కూడా చదవండి: రూటు మార్చిన భారత విద్యార్థులు.. అమెరికాను కాదని ఏ దేశానికి క్యూ కడుతున్నారంటే..

Updated Date - 2023-02-22T11:47:53+05:30 IST