NRI: పరమశివ తత్వాన్ని కలిగించేలా శివ మూర్తుల వైభవం

ABN , First Publish Date - 2023-06-09T09:04:18+05:30 IST

అధునాతన సాంకేతికతకు ఆలవాలమైన సిలికాన్ లోయ మహాదేవుని పదవిన్యాసపు ఆనంద అనుభూతిలో ఓ సాయంకాలం సేదదీరిన వైనం..

NRI: పరమశివ తత్వాన్ని కలిగించేలా శివ మూర్తుల వైభవం

ఎన్నారై డెస్క్: అధునాతన సాంకేతికతకు ఆలవాలమైన సిలికాన్ లోయ మహాదేవుని పదవిన్యాసపు ఆనంద అనుభూతిలో ఓ సాయంకాలం సేదదీరిన వైనం.. సనాతన ధర్మాన్ని సనూతనంగా నిలుపుకుంటున్న భారతీయ బంధువులు ధర్మ సంపదను వారసత్వంగా ముందుతరాలకు అందిస్తున్న విన్యాసం.. సామవేద సారమంతా వెల్లువయ్యి, శివపద మంజీరాల నాదధారలుగా పొంగి చైతన్యపు స్రవంతులు పశ్చిమ పర్వతసానువులను పులకింపచేసిన అద్భుతం.. బుడిబుడి నడకల బుజ్జాయిలు సైతం పరమశివ తత్వాన్ని తమ చుట్టూ ఉన్నవారిలో, అణువణువునా దర్శిస్తూ అందరికీ దర్శింపజేసిన ఆధ్యాత్మిక యోగం.

AA.jpg

శివపద చింతామణి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ దర్శించి కూర్చిన శివపదం సంకీర్తనలు “శివ మూర్తుల వైభవం” అయ్యి అమెరికాలో శాన్ హొసె (కాలిఫోర్నియా)లో గత ఆదివారం దర్శనమిచ్చాయి. ప్రతియేటా వేసవి కాలం మొదలవుతునే శివపద సమ్మోహనంలో ఓలలాడం, శాన్ హొసే ప్రాంతవాసులకు వాణి గుండ్లాపల్లి నిర్వహణలో 12 మంది గురువులు కూచిపూడి, భరతనాట్యం, మోహినీ ఆట్టం, కథక్, ఒడిసి రీతులన్నీ అలవోకగా మేళవిస్తూ సమ్మోహనపరిచాయి.

గురువులు:

గురు బిదిషా మొహంతీ (ఒడిసీ)

గురు నైన శాస్త్రి (భరతనాట్యం)

గురు పెండేకంటి సునీత (కూచిపూడి)

గురు రాజేష్ చావలి (కూచిపూడి)

గురు చందన వేటూరి (కూచిపూడి, భరతనాట్యాలు)

గురు భైరవి నెడుంగడి (మోహిని ఆట్టమ్)

గురు గణేశ్ వాసుదేవన్ (భరత నాట్యం)

గురు అఖిల రావు (భరతనాట్యం)

గురు దీపాన్విత సేన్ గుప్త (కథక్)

గురు సీమ చక్రబర్తి

గురు సుప్రియ సుధాకర్

AAA.jpg

గురు నూతి ప్రసూన (కూచిపూడి ) వారి శిష్యబృందంతో ఒక సరికొత్త సమ్ప్రదాయంగా రూపొందింది. భారత ప్రభుత్వ కాన్సులేట్ జనరల్ (శాన్ ఫ్రాన్సిస్కో) డాక్టర్ T.V. నాగేంద్ర ప్రసాద్ మాటల్లో చెప్పాలంటే - "షణ్ముఖ శర్మ గీతాలకు నృత్య రూపం ఇచ్చిన ఈ కళాకారులు ఈ బే ఏరియా (Bay Area) ను శివమయం చేశారు. ఇక్కడ నేను చూసిన కార్యక్రమాలన్నింటిలోకి ఇదే ది బెస్ట్. ఇప్పుడిక్కడ ఉద్యోగాలున్నాయి. భవిష్యత్తులో ఉద్యోగాలన్నీమన ఇండియాలోనే" అంటూ ఆయన సభక్తికంగా షణ్ముఖ శర్మకి పాదాభివందనం చేశారు.

AAAA.jpg

కంబోడియాలోని ఖ్మేర్ తమిళ సంఘం ప్రతినిధి డాక్టర్ రామేశ్వరాన్ని ప్రదర్శించిన గీతాలకు పెయింటింగ్స్ వేసిన దెందుకూరి రఘునాథుని కూడా సత్కరించారు. కాలిఫోర్నియా ప్రభుత్వ ప్రతినిధి జోష్ హూవర్ (Josh Hoover) పంపిన అభినందన పత్రాన్ని ఈ సందర్భంగా షణ్ముఖ శర్మ గారికి నాగేంద్ర ప్రసాద్ బహూకరించారు.

Updated Date - 2023-06-09T09:04:18+05:30 IST