Kuwait: విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు సరికొత్త వ్యూహం.. 5ఏళ్ల కాలపరిమితితో..

ABN , First Publish Date - 2023-02-02T08:34:29+05:30 IST

విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) సరికొత్త వ్యూహం రచిస్తోంది.

Kuwait: విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు సరికొత్త వ్యూహం.. 5ఏళ్ల కాలపరిమితితో..

కువైత్ సిటీ: విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) సరికొత్త వ్యూహం రచిస్తోంది. విదేశీ పెట్టుబడిదారులకు ఐదేళ్ల కాలపరిమితితో రెసిడెన్సీ (Residency) సౌకర్యం కల్పించాలని యోచిస్తున్నట్లు ఆ దేశ అంతర్గత మంత్రిత్వశాఖ (Interior Ministry) పేర్కొంది. ఇక ఈ రెసిడెన్సీ ఫెసిలిటీ ఉన్న విదేశీయులు ఎలాంటి పర్మిషన్ లేకుండా ఆరు నెలలకు మించి దేశం వెలుపల ఉండేందుకు కూడా వెసులుబాటు కల్పించనున్నట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. అంతేకాకుండా ప్రవేశించకుండా నిషేధించబడిన దేశాల పౌరులకు ప్రవేశ వీసాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు పెట్టుబడి సంస్థలు అనుమతి ఇస్తాయని మంత్రిత్వశాఖ పేర్కొంది.

ఇదిలాఉంటే.. టెక్నికల్ వర్కర్ల కోసం త్వరలోనే ప్రత్యేక కమర్షియల్ విజిట్ వీసాలు జారీ చేసే యోచనలో కువైత్ ఉన్నట్లు సమాచారం. దీనికి ఎలాంటి యూనివర్శిటీ డిగ్రీలు కూడా అవసరం లేదట. ఇక ఇటీవల విదేశీయుల పట్ల కఠినంగా ఉంటున్న గల్ఫ్ దేశం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కాస్తా ఊరటనిచ్చే విషయం అనే చెప్పాలి. కువైటైజేషన్ పాలసీ పేరిట గత కొంతకాలంగా ప్రవాసులకు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో భారీ మొత్తంలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వలస కార్మికుల ప్రాబల్యాన్ని తగ్గిస్తూ వస్తోంది.

Updated Date - 2023-02-02T08:36:32+05:30 IST