NATS: టంపాబే 'నాట్స్' ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య ప్రదర్శనకు చక్కటి స్పందన

ABN , First Publish Date - 2023-09-05T10:32:25+05:30 IST

అమెరికాలో భాషే రమ్యం.. సేవే గమ్యం అంటూ ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ప్లోరిడాలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శనకి మంచి స్పందన లభించింది.

NATS: టంపాబే 'నాట్స్' ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య ప్రదర్శనకు చక్కటి స్పందన

టంపాబే: అమెరికాలో భాషే రమ్యం.. సేవే గమ్యం అంటూ ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ప్లోరిడాలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శనకి మంచి స్పందన లభించింది. భారతీయ సంప్రదాయ నృత్య రూపమైన కూచిపూడిలో ప్రావీణ్యులు ప్రఖ్యాత నృత్య కళాకారుడు కళారత్న డా.కె.వి.సత్యనారాయణ నేతృత్వంలో జరిగిన ఈ నృత్యప్రద్శరన అందరిని ఆకట్టుకుంది. 30 మంది కూచిపూడి విద్యార్థులతో కూడిన కె.వి.సత్యనారాయణ రూపొందించిన ఈ నృత్య రూపకం ఆద్యంతం కన్నులపండువగా సాగింది.

NN.jpg

భారతీయ సంస్కృతి, సంప్రదాయల పట్ల అంకితభావంతో కూచిపూడిపై మమకారంతో కూచిపూడి నృత్యాన్ని నేర్చుకుని విద్యార్ధులు దానిని వేదికపై ప్రదర్శించిన ఔరా అనిపించింది. డాక్టర్ కె.వి. సత్యనారాయణ నృత్య దర్శకత్వంలో విద్యార్ధులు అద్భుతమైన కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించి అందరిని పరవశింపజేశారు.

NNN.jpg

ఈ ప్రదర్శన ఈ యువ నృత్యకారుల ప్రతిభను ఆవిష్కరించడమే కాకుండా కూచిపూడి కళను పరిరక్షించడంలో, ప్రోత్సహించడంలో డా.కె.వి.సత్యనారాయణ తిరుగులేని నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది. నాట్స్ కుటుంబసభ్యులు తమ పిల్లలతో కలిసి చేసిన ఈ వర్క్‌షాప్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో టంపాబే నాట్స్ టీమ్‌లో పని చేసిన ప్రతి ఒక్కరికి డా.కె.వి.సత్యనారాయణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నృత్య ప్రదర్శనను విజయవంతం చేయడానికి ముందుగా కె.వి. సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్ షాప్ విద్యార్ధులకు ఎంతగానో దోహదపడింది.

NNNN.jpg

డా.కె.వి.సత్యనారాయణను నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ శాలువాతో సత్కరించారు. టంపాబే నాట్స్ టీమ్ సంధ్య కాండ్రు మాధురి గుడ్లను లలిత అచ్చి, సబ్రీనా మాడభూషిని శాలువాలతో సత్కరించారు. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మాధురి గుడ్ల, సబ్రీనా మాడభూషి కీలకపాత్ర పోషించారు. ఆడియో, లైటింగ్ కోసం శైలేంద్ర.. వీడియో, ఛాయాగ్రహణం కోసం సుధీర్ మిక్కిలినేని పనిచేశారు. సురేష్ బొజ్జా, శిరీషా దొడ్డపనేని టంపాబే నాట్స్ సభ్యులు సుమంత్ రామినేని, విజయ్ కట్ట, సుధాకర్ మున్నగి, రాజేష్ కాండ్రు తదితరులు ఈ నృత్యప్రదర్శన నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.

NNNNNNN.jpg

ఈ కార్యక్రమానికి సహకరించిన నాట్స్ మాజీ ఛైర్మన్, నాట్స్ సంబరాలు 2025 కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డా. కొత్త శేఖరం, నాట్స్ బోర్డు వైస్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ బోర్డు డైరెక్టర్ శ్రీనివాస్ మల్లాది, నాట్స్ కార్య నిర్వాహక కమిటీ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్/మార్కెటింగ్), భాను ధూళిపాళ్ల, ప్రోగ్రామ్ నేషనల్ కో ఆర్డినేటర్ రాజేష్ కాండ్రు, జాయింట్ ట్రెజరర్ సుధీర్ మిక్కిలినేని, సలహా కమిటీ సభ్యులు ప్రసాద్ ఆరికట్ల, సురేష్ బొజ్జా, చాప్టర్ కోఆర్డినేటర్ సుమంత్ రామినేని, జాయింట్ కో ఆర్డినేటర్ విజయ్ కట్ట, కోర్ టీమ్ కమిటీ శ్రీనివాస్ అచ్చి, భాస్కర్ సోమంచి, నవీన్ మేడికొండ, హరి మండవ, భార్గవ్ మాధవరెడ్డి, ఇతర క్రియాశీల వాలంటీర్లు ఈ వర్క్‌షాప్ విజయవంతం చేయడానికి కృషి చేశారు.

NNNNN.jpg

ఈ నృత్య ప్రద్శర్శన కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్ వుమెన్ అరుణ గంటి, నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి (బాపు) నూతి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాట్స్ కార్యదర్శి రంజిత్ చాగంటి, కార్యనిర్వాహక మీడియా కార్యదర్శి మురళీకృష్ణ మేడిచెర్ల ఈ కార్యక్రమానికి తమ మద్దతు అందించారు.

NNNNNNNNN.jpg

వర్క్‌షాప్ సభ్యుల వివరాలు..

మాధురి స్కూల్ ఆఫ్ డ్యాన్స్

అను బడిగేర్, అనుక నాగబండి, అర్థి గౌరవెల్లి, అవ్యుత మండవ, దిశా అబ్బూరి, హర్షిణి జోస్యుల, మాధురి గుడ్ల, నిధి కశ్యప్, లక్ష్మీ గుత్తికొండ, మంచు కొండ, మంచు చంద్ర, అల్, రసజ్ఞ అవుల, సయాలి పాధ్యే, శారద మంగిపూడి, సుస్మిత గుడ్ల, త్రిష సాకమూరి

NNNNNNNN.jpg

రాగిణి స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్

అంజలి పటేల్, నిత్య రాగిణి మాడభూషి, శివాని టాటా, పార్థ్ అయ్యంగార్ మాడభూషి, కైషా మీనన్, ఇషానా భర్, ఐశ్వర్య విక్రమ్, తనుశ్రీ గునుపతి, వైష్ణవి గంగవరపు , మానస దండ, స్వాతి మోహన్, హస్వతి వరదరాజన్, ప్రహ్లాద్ మాడభూషి.

NNNNNN.jpg

Updated Date - 2023-09-05T10:32:25+05:30 IST