Share News

Kuwait: ప్రవాసులకు హెచ్చరిక.. రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించారో అంతే సంగతులు..!

ABN , First Publish Date - 2023-12-02T07:26:21+05:30 IST

అల్-ఖువైసత్ ప్రాంతంలో ముఖ్యంగా సుబియా వంతెన చుట్టూ రెసిడెన్సీ చట్ట ఉల్లంఘనలు, అనధికారికంగా వాహనాల అద్దె కార్యకలాపాలను నిర్వహిస్తున్న వారి కోసం జహ్రా సెక్యూరిటీ డైరెక్టరేట్ తనిఖీలు చేపట్టింది.

Kuwait: ప్రవాసులకు హెచ్చరిక.. రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించారో అంతే సంగతులు..!

కువైత్ సిటీ: అల్-ఖువైసత్ ప్రాంతంలో ముఖ్యంగా సుబియా వంతెన చుట్టూ రెసిడెన్సీ చట్ట ఉల్లంఘనలు, అనధికారికంగా వాహనాల అద్దె కార్యకలాపాలను నిర్వహిస్తున్న వారి కోసం జహ్రా సెక్యూరిటీ డైరెక్టరేట్ తనిఖీలు చేపట్టింది. మేజర్ జనరల్ అబ్దుల్లా అల్-రజైబ్ నేతృత్వంలో ఈ సోదాలు జరిగాయి. ఈ తనిఖీలలో చట్ట విరుద్ధంగా దేశంలో ఉంటున్న 15 మంది ప్రవాసులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతనంతరం వారిని దేశ బహిష్కరణకు సిఫార్సు చేయయడం జరిగింది. ఇవే తనిఖీలలో చట్టబద్ధమైన వయస్సు లేకుండా ఏటీవీ (ATV) లను నడుపుతున్న 300 మంది మైనర్లను కూడా సెక్యూరిటీ అధికారులు పట్టుకున్నారు. వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. బ్రిగేడియర్ జనరల్ ముహమ్మద్ తాహెర్ పర్యవేక్షణలో బ్రిగేడియర్ జనరల్ సలేహ్ ఓక్లా అల్-అజ్మీ నేతృత్వంలో ఈ ఆపరేషన్‌ నిర్వహించారు.

NRIs: అగ్రరాజ్యం అమెరికాలో ఘోరం.. ముగ్గురు నరరూప రాక్షసులు.. 20 ఏళ్ల యువకుడిని 7నెలల పాటు..!


ఆర్థిక ప్రయోజనాల కోసం చట్టవిరుద్ధంగా ప్రభుత్వ ఆస్తులను దోపిడీ చేసే వారిపై కేసులు నమోదు చేశారు. రెసిడెన్సీ, కార్మిక చట్టాలను ఉల్లంఘించిన కారణంగా 15 మంది ప్రవాస ఉపాంత కార్మికులు, వీధి వ్యాపారులను బహిష్కరణకు పంపారు. అలాగే కువైట్ ఎడారిని వక్రీకరించే, బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలను విసిరి పర్యావరణాన్ని కలుషితం చేసే కార్యకలాపాలను నిరోధించడానికి భద్రతా సిబ్బందికి ప్రత్యేక అధికారం ఇవ్వబడిందని ఈ సందర్భంగా జహ్రా సెక్యూరిటీ డైరెక్టరేట్ వెల్లడించింది. అటువంటి చర్యలలో పాల్గొనే వారి పట్ల జీరో-టాలరెన్స్ (zero-tolerance) విధానం అమలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు. ఇక ప్రవాసులు ఎట్టిపరిస్థితుల్లో రెసిడెన్సీ చట్టాల ఉల్లంఘనకు పాల్పడొద్దని అధికారులు తెలిపారు. నివాస చట్టాల ఉల్లంఘనదారులను వెంటనే దేశం నుంచి బహిష్కరించడం జరుగుతుందని హెచ్చరించారు.

NRIs: భారత పర్యాటకులకు తీపి కబురు.. వీసా ఫ్రీ ఎంట్రీకి మరో దేశం గ్రీన్ సిగ్నల్..!

Updated Date - 2023-12-02T07:26:23+05:30 IST