Indian Woman: ఐర్లాండ్‌లో ఘోరం.. భారతీయ మహిళ దారుణ హత్య.. జ్యుడీషియల్ కస్టడీకి భర్త..!

ABN , First Publish Date - 2023-07-18T10:50:58+05:30 IST

ఐర్లాండ్‌ (Ireland) లో ఘోరం జరిగింది. భారతీయ మహిళ (Indian Woman) దారుణ హత్యకు గురయింది.

Indian Woman: ఐర్లాండ్‌లో ఘోరం.. భారతీయ మహిళ దారుణ హత్య.. జ్యుడీషియల్ కస్టడీకి భర్త..!

డబ్లిన్: ఐర్లాండ్‌ (Ireland) లో ఘోరం జరిగింది. భారతీయ మహిళ (Indian Woman) దారుణ హత్యకు గురయింది. శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, భారతీయురాలిని ఆమె భర్తనే హత్య చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దాంతో అతడిని ఐరీష్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతురాలిని కేరళ రాష్ట్రం పలాక్కడ్ వాసి దీప దీనామణి (38) గా గుర్తించారు. శుక్రవారం విల్టన్ సమీపంలోని కార్క్ సిటీలో ఉన్న ఆమె ఇంట్లోనే దీప శవంగా కనిపించింది. ఆమె మృతదేహంపై కత్తితో పొడిచిన గాట్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆమె భర్త రిజిన్ రాజన్ (41) ను అదే రోజు రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కార్క్ డిస్ట్రిక్ట్ కోర్టు (Cork Ciry District Court) లో హాజరుపరచగా 20వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ (Judicial Custody) విధించింది న్యాయస్థానం. అయితే, ఈ దంపతులతో కలిసి ఉంటున్న ఓ బాలిక సమాచారం మేరకు రాజన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

కాగా, మృతురాలు దీప కార్క్ సిటీలోని ఓ ఫండ్ సర్వీస్ కంపెనీలో చార్టర్డ్ అకౌంటెంట్‌ (Chartered Accountant) గా పని చేస్తున్నట్లు సమాచారం. భర్త రాజన్ మాత్రం ఏ ఉద్యోగం లేక ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాడు. కొన్ని నెలల ముందే కార్క్ సిటీలోని ఆ ఇంట్లోకి దీప దంపతులు అద్దెకు దిగారు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. ఈ దంపతులకు ఐదేళ్ల బాబు ఉన్నాడు. హత్య సమయంలో ఆ పిల్లాడు ఇంట్లో లేడు. దీప ఇంటి పక్కనే ఉండే ఓ స్నేహితురాలు తన ఇంటికి తీసుకెళ్లింది. కొద్దిసేపటి తర్వాత బాబును తీసుకుని వచ్చినా స్నేహితురాలు.. దీప రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండడం చూసింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె సమాచారం మేరకు అక్కడికి వచ్చిన ఐరీష్ పోలీసులు రాజన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, కార్క్ సిటీలోని మలయాళీ సంస్థలు అక్కడి ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసి, దీప మృతదేహాన్ని స్వదేశానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నాయి.

Kuwait: తగ్గేదేలే అంటున్న కువైత్.. 2023లో భారీగా పెరిగిన ప్రవాస ఉద్యోగుల తొలగింపు.. అత్యధికులు మనోళ్లే..!

Updated Date - 2023-07-18T10:50:58+05:30 IST