ATA: 'రెట్రో నైట్ లైట్స్ అప్ అరిజోనా' 1980-90ల నేపథ్య సంగీత వేడుక

ABN , First Publish Date - 2023-09-20T13:17:35+05:30 IST

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో అద్భుతమైన రెట్రో నేపథ్య పార్టీకి ఫీనిక్స్ ఆతిథ్యమివ్వడంతో మనోహరమైన సంగీతాన్ని, ఆనందాన్ని ప్రేక్షకులకు అందించింది.

ATA: 'రెట్రో నైట్ లైట్స్ అప్ అరిజోనా' 1980-90ల నేపథ్య సంగీత వేడుక

ATA: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో అద్భుతమైన రెట్రో నేపథ్య పార్టీకి ఫీనిక్స్ ఆతిథ్యమివ్వడంతో మనోహరమైన సంగీతాన్ని, ఆనందాన్ని ప్రేక్షకులకు అందించింది. ఈ వేడుక భారతీయ సినిమా స్ఫూర్తిని, చలనచిత్ర వాతావరణాన్ని తీసుకువచ్చింది. ఈ వినోద కార్యక్రమానికి అన్ని వర్గాల నుండి అతిథులు హాజరయ్యారు.

R.jpg

ఇక ఈ వేడుక సాయంత్రం వేళ దాదాపు 300 మంది రాకతో కనులవిందుగా ప్రారంభమైంది. అక్కడ హాజరైనవారు చలన చిత్రాల పాటలతో ప్రేరేపిత ఫ్యాషన్‌తో సొగసైన చీరల నుండి షేర్వాణీల వరకు ధరించి రావడం విశేషం. అద్భుతమైన అలంకరణ, మిరుమిట్లు గొలిపే వెలుగులు, నేపథ్య సంగీతంతో గుర్తువుండిపోయే వేదికను ఏర్పాటు చేశారు.

RR.jpg

ప్రధాన వేదిక ఆహ్లాదకరమైన నృత్య ప్రదర్శనలతో మార్మోగింది. నటి లయ, గాయకుడు రఘు కుంచె వారి నృత్య, గాత్ర ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. హాజరైన ప్రేక్షకులు భారతీయ వంటకాలు, పానీయాలను ఆస్వాదించారు. రాత్రంతా ఆటలు, ప్రత్యక్ష పాటలు, భారతీయ పాత చలన చిత్ర ఆట, పాటలతో అలరించారు. హాజరైన ప్రేక్షకులు ఇలాంటివి భవిష్యత్తులో మరిన్ని జరగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించడం జరిగింది.

RRRR.jpg

మొత్తం మీద అరిజోనాలోని ఫీనిక్స్‌లో సంగీత వేడుక జరుపుకోవడానికి వేదికను అందించిన 'ఆటా' అందరినీ అలరించింది. ప్రాంతీయ డైరెక్టర్ రఘు ఘాడీ భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. సమాజ సేవను ప్రోత్సహించడం, సాంస్కృతిక వైవిధ్యం, వారసత్వాన్ని జరుపుకోవడం కోసం ఈ సందర్భంగా ప్రణాళికలు ప్రకటించారు.

RRRRRRR.jpg

ఈ సందర్భంగా ప్రాంతీయ కోఆర్డినేటర్లు చెన్నయ్య మద్దూరి, వంశీ ఏరువరం, శేషిరెడ్డి గాదె, సునీల్ అన్నపురెడ్డి, ఫరితొష్ పొలి, మహిళా చైర్ శుభ, బింద్య, నివేదిత ఘాడీ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు, సంస్కృతికి చెందిన వారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

RRR.jpg

Updated Date - 2023-09-20T13:17:35+05:30 IST