Indian origin: భారత సంతతి ఏడేళ్ల బ్రిటన్ బాలికకు ప్రతిష్టాత్మక అవార్డ్

ABN , First Publish Date - 2023-07-20T10:45:29+05:30 IST

భారత సంతతికి చెందిన ఏడేళ్ల బ్రిటన్ బాలిక మోక్ష రాయ్ (Moksha Roy) ప్రతిష్టాత్మక 'బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డు' (UK PM's Points of Light Award) ను గెలుచుకుంది.

Indian origin: భారత సంతతి ఏడేళ్ల బ్రిటన్ బాలికకు ప్రతిష్టాత్మక అవార్డ్

లండన్: భారత సంతతికి చెందిన ఏడేళ్ల బ్రిటన్ బాలిక మోక్ష రాయ్ (Moksha Roy) ప్రతిష్టాత్మక 'బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డు' (UK PM's Points of Light Award) ను గెలుచుకుంది. మైక్రోప్లాస్టిక్ కాలుష్యానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి చేపట్టిన కార్యక్రమం కోసం ఆమె మూడేళ్ల ప్రాయం నుంచే స్వచ్ఛందంగా పని చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె సేవలకు గుర్తింపుగా బ్రిటన్ ఉపప్రధాని ఆలివర్ డౌడెన్ (Deputy British Prime Minister Oliver Dowden) గతవారం మోక్షకు పురస్కారాన్ని అందజేశారు. ఆర్థిక సహకారం అవసరమైన చిన్నారులను ఆదుకునేందుకు నిధుల సేకరణ సహా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై పలు కార్యక్రమాలను చేపట్టడం ద్వారా మోక్ష బ్రిటన్‌లో మంచి గుర్తింపు పొందారు.

Dubai to India: దుబాయి నుంచి స్వదేశానికి వస్తున్న కూతురు.. తల్లిని ఏం గిఫ్ట్ తేవాలని అడిగితే.. ఆమె అడిగిందేంటో తెలిస్తే..


Updated Date - 2023-07-20T10:45:29+05:30 IST