Big Ticket draw: రూ.34కోట్లు గెలిచిన భారతీయుడు.. తీరా లాటరీ నిర్వాహకులు ఫోన్ చేస్తే నో రెస్పాన్స్..!

ABN , First Publish Date - 2023-10-05T07:54:47+05:30 IST

అబుదాబి బిగ్ టికెట్ రాఫెల్‌ (Abu Dhabi Big Ticket raffle) లో భారతీయ ప్రవాసుడు (Indian Expat) జాక్‌పాట్ కొట్టాడు. ఏకంగా 15 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్నాడు.

Big Ticket draw: రూ.34కోట్లు గెలిచిన భారతీయుడు.. తీరా లాటరీ నిర్వాహకులు ఫోన్ చేస్తే నో రెస్పాన్స్..!

అబుదాబి: అబుదాబి బిగ్ టికెట్ రాఫెల్‌ (Abu Dhabi Big Ticket raffle) లో భారతీయ ప్రవాసుడు (Indian Expat) జాక్‌పాట్ కొట్టాడు. ఏకంగా 15 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్నాడు. మన కరెన్సీలో అక్షరాల రూ. 33.99కోట్లు. ఖతార్‌లో ఉండే భారతీయుడు ముజీబ్ తెక్కే మట్టియేరి (Mujeeb Thekke Mattieri) కి ఈ జాక్‌పాట్ తగిలింది. సెప్టెంబర్ 27వ తారీఖున ముజీబ్ ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసిన సిరీస్ 256, లాటరీ టికెట్ నం. 098801 అతనికి ఈ అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. అయితే, లాటరీ నిర్వాహకులు భారత ప్రవాసుడికి ఫోన్ చేయగా అతడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదని తెలిపారు. విజేతగా నిలిచిన విషయం అతడికి చేరేవేసేందుకు వేరే మార్గల్లో ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని అతనికి తెలియజేసేందుకు షో హోస్ట్ రిచర్డ్, బౌచ్ర ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేశారు. కానీ, అవతలివైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదట. ఇతర మార్గల్లో ప్రయత్నించి ముజీబ్‌కు ఈ గ్రాండ్ ప్రైజ్‌ను అందజేస్తామని రిచర్డ్ చెప్పుకొచ్చారు.

Kuwait: అన్నంత పని చేస్తున్న కువైత్.. 800 మంది ప్రవాసులు సర్వీస్ నుంచి తొలగింపు!


Updated Date - 2023-10-05T07:54:47+05:30 IST