Kuwait: భారత ఎంబసీ కీలక ప్రకటన.. ప్రవాసులు చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ..

ABN , First Publish Date - 2023-02-17T10:29:35+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్‌లోని భారత ఎంబసీ తాజాగా కీలక ప్రకటన చేసింది.

Kuwait: భారత ఎంబసీ కీలక ప్రకటన.. ప్రవాసులు చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ..

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌లోని భారత ఎంబసీ తాజాగా కీలక ప్రకటన చేసింది. వాఫ్రా (Wafra) ప్రాంతంలోని భారత ప్రవాసుల కోసం 'కాన్సులర్ క్యాంప్' (Consular Camp) నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. వాఫ్రాలోని ఫైజల్ ఫార్మ్‌లో (బ్లాక్-09, లైన్-10, రోడ్-500 సమీపంలోని అల్-వాఫ్రా ఫ్యామిలీ కోఆపరేటివ్ సోసైటీ) ఫిబ్రవరి 18న (శనివారం) ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు (కువైత్ కాలమానం ప్రకారం) ఈ క్యాంప్ ఉంటుందని తెలిపింది. ఇక క్యాంప్‌లో భాగంగా వివిధ సర్వీసులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

వాటిలో పాస్‌పోర్ట్ రెన్యువల్, ఆన్‌లైన్ ఫార్మ్ ఫిల్లింగ్, ఫొటోగ్రాఫ్, రిలేషన్‌షిప్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌ట్రాక్ట్, జనరల్ పవర్ ఆఫ అటార్నీ, సిగ్నేచర్ అటెస్టేసన్‌తో పాటు ఇతర జనరల్ సర్వీసులు కూడా అందుబాటులో ఉంటాయని ఎంబసీ అధికారులు వెల్లడించారు. అన్నీ ధృవపత్రాలు క్యాంపులోనే జారీ చేయడం జరుగుతుంది కనుక కమ్యూనిటీ సభ్యులు పత్రాలను తీసుకోవడానికి ఎంబసీకి వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. ఇక ఈ సర్వీసులకు అయ్యే ఫీజులను కేవలం నగదు రూపంలో మాత్రమే స్వీకరించడం జరుగుతుందని ఎంబసీ స్పష్టం చేసింది. వాఫ్రా ప్రాంతంలోని భారత ప్రవాసులు ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాయబార కార్యాలయం చెప్పుకొచ్చింది.

ఇది కూడా చదవండి: ఎన్నారైలకు ప్రయోజనం కలిగేలా బైడెన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై భారత చిన్నారులకు..

Updated Date - 2023-02-17T10:29:37+05:30 IST