Share News

GTA Washington DC: 'గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్' ఆధ్వర్యంలో ఘనంగా సద్దుల బతుకమ్మ, దసరా సంబరాలు

ABN , First Publish Date - 2023-10-22T12:15:03+05:30 IST

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ, దసరా సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అక్టోబర్ 22న (ఆదివారం) బ్రాడ్ రన్ హైస్కూల్‌లో మద్యాహ్నం 12 నుండి- సాయంత్రం 7 గంటల వరకు (అమెరికా కాలమానం ప్రకారం) ఈ వేడుకలు నిర్వహించనున్నారు.

GTA Washington DC: 'గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్' ఆధ్వర్యంలో ఘనంగా సద్దుల బతుకమ్మ, దసరా సంబరాలు

GTA Washington DC: అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ, దసరా సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అక్టోబర్ 22న (ఆదివారం) బ్రాడ్ రన్ హైస్కూల్‌లో మద్యాహ్నం 12 నుండి- సాయంత్రం 7 గంటల వరకు (అమెరికా కాలమానం ప్రకారం) ఈ వేడుకలు నిర్వహించనున్నారు. సుమారు 3,000 మందికి పైగా హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. ఉచిత భోజనము, షాపింగ్ మాల్, బెస్ట్ బతుకమ్మలకు బంగారు బహుమతులు, కిడ్స్ ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, జానపద నృత్యాలు, డ్యాన్స్ పోటీలు, గౌరి మరియు జమ్మి పూజ గ్లోబల్ ఇలా పలు ఆసక్తికరమైన ఈవెంట్లను తెలంగాణ అసోసియేషన్ వాషింగ్టన్ డీసీ కమిటి వారు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక జీటీఏ వాషింగ్టన్ డీసీ తెలంగాణ ఆడపడుచుల ఆటపాటలతో సద్దుల బతుకమ్మ & దసరా సంబరాల టీజర్, పోస్టర్ లాంచ్ కార్యక్రమానికి వివిధ నగరాల నుంచి సుమారు 500 పైగా హాజరయ్యారు. అక్టోబర్ 21న తెలంగాణ సంస్కృతిని కిడ్స్‌కి పంచె విధంగా బతుకమ్మ వర్క్ షాప్ నిర్వహించటం జరుగుతుంది.

GTA2.jpg

తెలంగాణ ఆడపడుచులు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగనే బతుకమ్మ. తెలంగాణ సంస్కృతికి ఆనవాలు బతుకమ్మ. 9 రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా సందడే సందడిగా కనబడుతుంది. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన సంబురాలు 9వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఎనిమిది రోజుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిపి.. ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మలతో ఈ ఎనిమిది రోజులు వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తారు. బతుకమ్మ పండగలో ఆఖరి 9వ రోజు 'సద్దుల బతుకమ్మ'ను ఆరాధిస్తారు. ఆ రోజు ఎన్ని పూలు దొరికితే అన్ని పూలతో బతుకమ్మను పెద్దగా అందంగా వివిధ రంగులతో పేరుస్తారు. ఆడవారు తమ ఆటపాటలతో 'సద్దుల బతుకమ్మ' పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటారు.

GTAA.jpg

Updated Date - 2023-10-22T12:15:03+05:30 IST