Oman: ఒమాన్‌ జనాభాలో ప్రవాసుల వాటా 43 శాతం

ABN , First Publish Date - 2023-07-19T08:12:47+05:30 IST

గల్ఫ్ దేశం ఒమాన్‌ (Oman) లో ప్రవాసుల వాటా 43శాతంగా ఉన్నట్లు తాజాగా వెలువడిన నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) నివేదిక వెల్లడించింది.

Oman: ఒమాన్‌ జనాభాలో ప్రవాసుల వాటా 43 శాతం

మస్కట్: గల్ఫ్ దేశం ఒమాన్‌ (Oman) లో ప్రవాసుల వాటా 43శాతంగా ఉన్నట్లు తాజాగా వెలువడిన నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) నివేదిక వెల్లడించింది. ఈ రిపోర్ట్ ప్రకారం జూలై 10 నాటికి ఆ దేశ జనాభా 50,83,300కి చేరుకుంది. ఇక ప్రపంచ జనాభా దినోత్సవం (World Population Day) సందర్భంగా విడుదల చేసిన ఎన్‌సీఎస్ఐ నివేదికలో ఒమానీయుల (Omani Nationals) వాటా 57శాతం కాగా, 43 శాతం మంది ప్రవాసులు (Expatriates) ఉన్నట్లు తెలిసింది. అంతేగాక ఒమానీ పరుషుల కంటే ప్రవాస పురుషుల సంఖ్య 4.8శాతం అధికంగా ఉందని రిపోర్ట్ పేర్కొంది. ఇక వలసదారుల జనాభాలో 17,02,905 మంది పరుషులు ఉంటే.. 4,82,913 మంది స్త్రీలు ఉన్నారు. ఒమానీ జనాభాలో పురుషులు 1458907 (28.7శాతం) ఉండగా, మహిళలు 1438573 (28.3శాతం) ఉన్నారు. ఒమాన్ జనాభా ఏడాదికి 1.49 శాతం చొప్పున పెరుగుతోందని నివేదిక తెలిపింది.

Kuwait: తగ్గేదేలే అంటున్న కువైత్.. 2023లో భారీగా పెరిగిన ప్రవాస ఉద్యోగుల తొలగింపు.. అత్యధికులు మనోళ్లే..!

Updated Date - 2023-07-19T08:12:47+05:30 IST