Saudi Arabia: సౌదీ సర్కార్ తీపి కబురు.. ఇకపై ప్రవాసులకు ఆ వెసులుబాటు..

ABN , First Publish Date - 2023-02-05T11:25:39+05:30 IST

వలసదారులకు సౌదీ అరేబియా (Saudi Arabia) సర్కార్ తీపి కబురు చెప్పింది.

Saudi Arabia: సౌదీ సర్కార్ తీపి కబురు.. ఇకపై ప్రవాసులకు ఆ వెసులుబాటు..

రియాద్: వలసదారులకు సౌదీ అరేబియా (Saudi Arabia) సర్కార్ తీపి కబురు చెప్పింది. ఇకపై ప్రవాసులు (Expatriate) తమ వివాహ ధృవీకరణ పత్రం (Marriage Certificate Attestation) సౌదీ న్యాయస్థానాల నుంచి పొందే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఇక్కడ చిన్న షరతు విధించింది. వధువు తండ్రికి సౌదీలో నివాసం ఉంటేనే ఇది సాధ్యం అవుతుందని ఆ దేశ న్యాయమంత్రిత్వ శాఖ (Ministry of Justice) స్పష్టం చేసింది. ప్రవాస దంపతులు కింగ్‌డమ్‌ను విజిట్ లేదా ట్రాన్సిట్ వీసాపై (Transit Visa) విజిట్ చేసిన సమయంలో తమ వివాహ ఒప్పంద పత్రాన్ని పొందవచ్చని వెల్లడించింది. దీనిలో భాగంగా కపుల్స్ నజీజ్ సెంటర్ ఫర్ జ్యుడీషియల్ సర్వీసెస్ ద్వారా తమ వివాహాన్ని డాక్యుమెంట్ చేసుకోవాలని మంత్రిత్వశాఖ సూచించింది. ఈ సర్వీస్ కోసం నజీజ్ పోర్టల్ (Najiz Portal) ‌ను సందర్శించాల్సిందిగా తెలిపింది. అబ్షర్ ప్లాట్‌ఫారమ్‌లో అన్ని వివరాలు నమోదు చేయడం ద్వారా దంపతులు ఈ సర్వీస్ తాలూకు విధానాలను పూర్తి చేసినట్లు అని పేర్కొంది. ఈ సేవలను ప్రవాసులు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా న్యాయమంత్రిత్వ శాఖ తెలియజేసింది.

ఇది కూడా చదవండి: డైమండ్ నెక్లెస్ ఎత్తుకెళ్లిన ఎలుక.. నెటిజన్ల ఫన్నీ కామెంట్స్!

Updated Date - 2023-02-05T11:36:42+05:30 IST