Share News

NRIs: లండన్‌లో ఎన్నారైల 'మొవెంబర్' ఈవెంట్

ABN , First Publish Date - 2023-12-10T13:17:04+05:30 IST

NRI News: లండన్‌లోని స్లవ్ ప్రాంతంలో ప్రవాస భారతీయులు స్థాపించిన బెర్కషైర్ బాయ్స్ కమ్యూనిటీ (B.B.C) అనే ఛారిటబుల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 'మొవెంబర్' (Movember) అనే ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించారు.

NRIs: లండన్‌లో ఎన్నారైల 'మొవెంబర్' ఈవెంట్

NRI News: లండన్‌లోని స్లవ్ ప్రాంతంలో ప్రవాస భారతీయులు స్థాపించిన బెర్కషైర్ బాయ్స్ కమ్యూనిటీ (B.B.C) అనే ఛారిటబుల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 'మొవెంబర్' (Movember) అనే ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించారు. మగవారిలో వచ్చే ప్రోస్టేట్ కాన్సర్ (Prostate Cancer) గురించి అవగాహన కోసం ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో నిర్వహిస్తున్నామని ఆర్గనైజేషన్ కార్య నిర్వాహక సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్య నిర్వాహక సభ్యులు సంజీవ్ అంకిరెడ్డి, గోవర్ధన్ వడ్లపట్ల, సతీష్ చింతపండు, విషి మనికిరెడ్డి, రవి మంచిరాజు, సత్యనారాయణ నోముల, రవి మేకల, సత్యనారాయణ ఆవుల, శ్రీధర్ బేతి, తిరుమల కాగిత, ప్రకాష్ విత్తనాలు, రమేష్ బుక్క పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన సుమారు 2 లక్షల రూపాయలను మొవెంబర్ ఛారిటీకి అందజేశామన్నారు.

  • మరిన్ని NRI NEWS కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-10T13:17:06+05:30 IST