Share News

Bathukamma Sambaraalu: టోరొంటోలో 'తాకా' ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

ABN , First Publish Date - 2023-10-25T08:46:10+05:30 IST

తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (Telugu Alliances of Canada-TACA) ఆధ్వర్యంలో అక్టోబరు 21న (శనివారం రోజు) గ్రేటర్ టోరొంటో‌లోని లింకన్ అలెగ్జాండర్ పాఠశాల ఆడిటోరియంలో 1000 మందికి పైగా ప్రవాస తెలుగు, తెలంగాణ వాసులు పాల్గొని బతుకమ్మ ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు.

Bathukamma Sambaraalu: టోరొంటోలో 'తాకా' ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

Bathukamma Sambaraalu in Toronto: తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (Telugu Alliances of Canada-TACA) ఆధ్వర్యంలో అక్టోబరు 21న (శనివారం రోజు) గ్రేటర్ టోరొంటో‌లోని లింకన్ అలెగ్జాండర్ పాఠశాల ఆడిటోరియంలో 1000 మందికి పైగా ప్రవాస తెలుగు, తెలంగాణ వాసులు పాల్గొని బతుకమ్మ ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. మహిళలు సంప్రదాయ దుస్తులతో బతుకమ్మ ఆటలు ఆడుతూ పాటలు పాడుకున్నారు. ఉత్తమ బతుకమ్మ బహుమతిని ధనలక్ష్మి బొద్దుల, ఉత్తమ బతుకమ్మ పార్టిసిపెంట్‌గా సౌజన్య బలబద్రపాత్రుని, ఉత్తమ డ్రెస్స్‌కు గాను ఆశ్విని యెర్ర గారలు గెలుచుకున్నారు. పండుగ మొదటి నుంచి ఆఖరు వరకు ప్రముఖ గాయకురాలు పారిజాతం, ఆశ్రిత పొన్నపల్లి లైవ్ బతుకమ్మ పాటలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా టీఏసీఏ (TACA) ఆధ్వర్యంలో మంచి రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేశారు.

TT.jpg

ఈ పండుగ సంబురాలు TACA అధ్యక్షురాలు కల్పన మోటూరి ఆధ్వర్యంలో జరుగగా, నాగేంద్ర హంసాల, కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి, కోశాధికారి మల్లిఖార్జునాచారి పదిర, డైరక్టర్లు అనిత సజ్జ, శ్రుతి ఏలూరి, ఖాజిల్, ట్రుస్టీ బోర్డు చైర్మన్ మునాఫ్ , ట్రస్టీ సురేశ్ కూన, ప్రవీణ్ పెనుబాక, రాఘవ్ అల్లం, సంస్థ ఫౌండర్లు చారి సామంతపుడి, అరుణ్ కుమార్ లయం, శ్రీనాథ్ కుందూరి, రమేశ్ మునుకుంట్ల, మునాఫ్ పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమ ఏర్పాట్లలో రవి వారణాశి, ఫౌండర్లు రాకేశ్ గరికపాటి, లోకేశ్ చిల్లకూరు, రమచంద్ర రావు దుగ్గిన, డైరెక్టర్లు గణేశ్ తెరాల, ప్రదీప్ రెడ్డి, విద్య భవనం ఎంతో సహకరించారు.

TTT.jpg

Updated Date - 2023-10-25T08:46:10+05:30 IST