Share News

Sigapore: సింగపూర్‌లో అంబరాన్ని తాకిన బతుకమ్మ సంబురాలు

ABN , First Publish Date - 2023-10-22T09:29:55+05:30 IST

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం స్థానిక టాంపినీస్ సెంట్రల్ పార్క్‌లో సింగపూర్ బతుకమ్మ వేడుకలు అత్యంత కన్నుల పండువగా జరిగాయి.

Sigapore: సింగపూర్‌లో అంబరాన్ని తాకిన బతుకమ్మ సంబురాలు

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ౹

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో సింగపూర్ గౌరమ్మ ఉయ్యాలో ౹౹

Bathukamma Celebrations in Singapore: సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం స్థానిక టాంపినీస్ సెంట్రల్ పార్క్‌లో సింగపూర్ బతుకమ్మ వేడుకలు అత్యంత కన్నుల పండువగా జరిగాయి. ప్రతి సంవత్సరం పెద్దల అమావాస్య నాడు మొదలయి తొమ్మిది రోజులపాటు జరిగి చివరి రోజు సద్దుల బతుకమ్మ పూజలతో ముగిసే ఈ వేడుకులలో ఆడబిడ్డలు ప్రత్యేకించి అందరూ ప్రకృతిని పూలతో ఆరాధించి ఆ గౌరమ్మ తల్లి ఆశీస్సులు కోరతారు.

BB.jpg

సాయంత్రం 5గం౹౹ లకు మొదలైన ఈ వేడుకులలో సింగపూర్‌లోని వివిధ ప్రాంతాల నుండి ఆడపడచులు, పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొని జయప్రదం చేశారు. ఆడవారు పోటాపోటీగా వివిధ రకాల పూలతో గోపురాలుగా తయారు చేసిన బతుకమ్మలను మధ్యలో పెట్టి తమ ఆటపాటలు, భక్తిశ్రద్ధలతో గౌరమ్మను కొలిచారు. చిన్న పిల్లలు కొత్త బట్టలతో అప్పుడే గంతులేస్తున్న లేడి పిల్లల వలే ఆ ఆవరణ అంతా కలియ తిరుగుతూ కోలాహలంగా బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. అంతేకాకుండా సింగపూర్ స్థానికులు సైతం పండుగను ఆసక్తి గా అడిగి తెలుసుకొని ఆసాతం వేడుకలను తిలకించారు. బతుకమ్మ ఆడిన అనంతరం శాస్త్రోత్తంగా సాగనంపుటకు నిమజ్జన ఏర్పాట్లు చేశారు.

BBBBBB.jpg

సింగపూర్ తెలుగు సమాజం వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బతుకమ్మ ఆహుతులను ఆకర్షించింది. మొదటి మూడు ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమ నిర్వహణలో తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా అధ్యక్షులు బొమ్మారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన పండుగ విశిష్టతను తెలియచేస్తూ.. ఈ పండుగ తెలంగాణ గ్రామీణ వికాసాన్ని తెలియచేస్తుందని, ప్రాంతాలకతీతంగా ఈ పండుగను నిర్వహించడం ద్వారా విదేశాల్లో కూడా తెలుగువారి ఐక్యతను మరొసారి చాటామని పేర్కొన్నారు.

Bathukamma.jpg

ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్‌గా వ్యవహరించిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, కౌ అండ్ ఫార్మర్, సరిగమ రెస్టారెంట్, ఫ్లేవర్స్ రెస్టారెంట్, తందూర్ లాంజ్ రెస్టారెంట్, జానిక్ కంపనీ ఇన్కార్పోరేషన్స్, జీఐజీ ఇంటర్నేషనల్ స్కూల్, వేలన్ సూపర్ మార్ట్, మెగా గ్రాసరీ మార్ట్‌ల వారికి నిర్వాహకులు కురిచేటి స్వాతి ధన్యవాదాలు తెలియజేశారు.

BBBBBBB.jpg

ఈ సందర్భంగా కార్యదర్శి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. దాదాపు 4 గం౹౹ పాటు సాగిన ఈ కార్యక్రమానికి సుమారు 1,700 మంది హాజరయ్యారని తెలిపారు. ఆహుతులకు భోజన సదుపాయం ఏర్పాటు చేశామని, సింగపూర్ తెలుగు సమాజాన్ని అన్ని వేళలా ఆదరిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన సింగపూర్‌లో నివసిస్తున్న తెలుగువారందరికీ కృతజ్ఞతాభినందనలు తెలియజేశారు. అలాగే అంతర్జాల మాధ్యమాల ద్వారా సుమారు 5,000 మంది ప్రత్యక్షప్రసారాన్ని వీక్షించారు.

BBBB.jpg

ఈ కార్యక్రమంలో లక్కీ విజేతలకు 5 గ్రా౹౹ బంగారం, వివిధ ఆకర్షణీయమైన బహుమతులు అందజేశారు. సింగపూర్ తెలుగు వారితో పాటు కమిటీ సభ్యులు, వాలంటీర్స్, స్నేహితులు, వారి కుటుంబాలు ఇలా ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమం సింగపూర్‌లో ఉన్న వారందరినీ విశేషంగా ఆకర్షించింది.

B.jpg

BBBBB.jpg

Updated Date - 2023-10-22T09:29:55+05:30 IST