NRI: శాన్‌ఫ్రాన్సిస్కో నూతన కాన్సులేట్‌ జనరల్‌‌ని అభినందించిన 'ఆటా' ఉపాధ్యక్షులు

ABN , First Publish Date - 2023-08-30T11:16:29+05:30 IST

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఉపాధ్యక్షులు జయంత్ చల్లా, ట్రస్ట్ బోర్ద్ సభ్యులు రిండ సామ, కమ్యునిటి లీడర్ వినోద్ నాగి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నూతన కాన్సులేట్‌ జనరల్‌గా నియమితులైన డాక్టర్‌ శ్రీకర్‌ కె రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు.

NRI: శాన్‌ఫ్రాన్సిస్కో నూతన కాన్సులేట్‌ జనరల్‌‌ని అభినందించిన 'ఆటా' ఉపాధ్యక్షులు

NRI: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఉపాధ్యక్షులు జయంత్ చల్లా, ట్రస్ట్ బోర్ద్ సభ్యులు రిండ సామ, కమ్యునిటి లీడర్ వినోద్ నాగి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నూతన కాన్సులేట్‌ జనరల్‌గా నియమితులైన డాక్టర్‌ శ్రీకర్‌ కె రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ఆటా ఉపాధ్యక్షులు జయంత్ చల్లా సంస్థ సేవా కార్యక్రమాలు, డిసెంబర్‌లో జరిగే ఆటా వేడుకలు వివరించారు. అలాగే వచ్చే ఏడాది జూన్‌లో జరిగే ఆటా 18వ కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్, అట్లాంటాకు ఆహ్వానించారు.

Srikar.jpg

తెలంగాణలోని యాదాద్రి జిల్లా మోత్కూరు మండలంలోని కొండగడప గ్రామంలో జన్మించిన డాక్టర్‌ శ్రీకర్‌ కె రెడ్డి 1996లో కాకతీయ వర్సిటీ వైద్య కళాశాల నుంచి ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. అనంతరం ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికై తన బ్యాచ్‌లోనే సమర్థుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. జర్మనీలోని బెర్లిన్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయంలో పనిచేశారు. ఢిల్లీలోని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలోనూ సేవలందించారు. గతంలో కాన్సుల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాగా పనిచేసిన డాక్టర్‌ టి.వి.నాగేంద్ర ప్రసాద్ తర్వాత మరో తెలుగు వ్యక్తి ఆ పదవి చేపట్టడం తెలుగువారికి గర్వకారణం.

Updated Date - 2023-08-30T11:16:29+05:30 IST