Visa-free travel to UAE: 82 దేశాల వారికి యూఏఈ తీపి కబురు.. భారతీయులకు మాత్రం కండిషన్ అప్లై..!

ABN , First Publish Date - 2023-08-30T07:51:20+05:30 IST

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) 82 దేశాల వారికి గుడ్‌న్యూస్ చెప్పింది. ఆయా దేశాల పౌరులు ఎలాంటి ముందస్తు వీసా లేకుండా దేశంలోకి ప్రవేశించడానికి అనుమతి ఇచ్చింది.

Visa-free travel to UAE: 82 దేశాల వారికి యూఏఈ తీపి కబురు.. భారతీయులకు మాత్రం కండిషన్ అప్లై..!

Visa-free travel to UAE: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) 82 దేశాల వారికి గుడ్‌న్యూస్ చెప్పింది. ఆయా దేశాల పౌరులు ఎలాంటి ముందస్తు వీసా లేకుండా దేశంలోకి ప్రవేశించడానికి అనుమతి ఇచ్చింది. అలా వచ్చే ఆ దేశాల పర్యాటకులకు రెండు రకాల వీసాలను అందుబాటులో ఉంచింది. అందులో ఒకటి 30 రోజుల గడువుతో ఎంట్రీ వీసా. ఈ వీసాను మరో 10రోజుల పాటు పొడిగించుకునే వెసులుబాటు సైతం కల్పించింది. అలాగే రెండోది 90 రోజుల వ్యవధితో మరో వీసా. ఇక జీసీసీ (GCC) దేశాలకు చెందిన వారు పాస్‌పోర్ట్ లేదా వారి ఐడెంటిటీ కార్డులను చూపించి దేశంలోకి ఎంటర్ కావొచ్చు. వారికి ఎలాంటి వీసా లేదా స్పాన్సర్ అవసరం లేదు.

భారతీయుల విషయానికి వస్తే..

ఇక మనోళ్లు సాధారణ ఇండియన్ పాస్‌పోర్టు (Indian Passport) కలిగి ఉంటే 14 రోజుల గడువుతో 'ఎంట్రీ వీసా అన్ అరైవల్' సౌకర్యం ఉంది. ఈ వీసాను మరో 14 రోజులకు పొడిగించుకునే వెసులుబాటు ఇచ్చింది. అయితే, ఆ దేశంలోకి ప్రవేశించే తేదీ నుంచి పాస్‌పోర్ట్ అనేది ఆరు నెలలు చెల్లుబాటు అయ్యేలా ఉండటం తప్పనిసరి. అలాగే ప్రయాణికుడు తప్పనిసరిగా యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్ లేదా ఏదైనా యూరోపియన్ యూనియన్ (European Union) దేశం జారీ చేసిన సందర్శన వీసా లేదా శాశ్వత నివాసం కార్డు (Permanent Residency Card) ను కలిగి ఉండాలి. కాగా, వీసా రహిత ప్రవేశం (Visa-free Entry) లేదా (Visa upon Arrival) కోసం అర్హత లేని సందర్శకులు దేశంలోకి ప్రవేశించే ముందు వారి స్పాన్సర్ జారీ చేసే ఎంట్రీ పర్మిట్ (Entry Permit) అవసరమని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (General Directorate of Residency and Foreigners Affairs) వెల్లడించింది.

Big Alert to Travellers: యూఏఈ వెళ్తున్నారా..? అయితే మీ లగేజీలో ఈ వస్తువులు లేకుండా చూసుకోండి..!

Updated Date - 2023-08-30T07:53:16+05:30 IST