ATA: అట్లాంటాలో 18వ ఆటా మహాసభల సన్నాహాలకు శ్రీకారం

ABN , First Publish Date - 2023-09-13T07:59:56+05:30 IST

అమెరికా తెలుగు సంఘం (ఆటా) ద్వైవార్షికంగా నిర్వహించు 18వ మహాసభలను 2024 జూన్ 7,8 మరియు 9 తేదీలలో అట్లాంటాలో అత్యంత వైభవోపేతంగా జరుపుటకు గాను 2023 సెప్టెంబరు 8,9,10 తేదీలలో అట్లాంటాలోని మారియట్ హోటల్‌లో ఆటా బోర్డు సమావేశం, ఫేస్ ఈవెంట్స్ నందు ఆటా18వ మహాసభల కిక్ ఆఫ్ కార్యక్రమం నిర్వహించబడింది.

ATA: అట్లాంటాలో 18వ ఆటా మహాసభల సన్నాహాలకు శ్రీకారం

ATA: అమెరికా తెలుగు సంఘం (ఆటా) ద్వైవార్షికంగా నిర్వహించు 18వ మహాసభలను 2024 జూన్ 7,8 మరియు 9 తేదీలలో అట్లాంటాలో అత్యంత వైభవోపేతంగా జరుపుటకు గాను 2023 సెప్టెంబరు 8,9,10 తేదీలలో అట్లాంటాలోని మారియట్ హోటల్‌లో ఆటా బోర్డు సమావేశం, ఫేస్ ఈవెంట్స్ నందు ఆటా18వ మహాసభల కిక్ ఆఫ్ కార్యక్రమం నిర్వహించబడింది. సెప్టెంబరు 8న (శుక్రవారం) సాయంత్రం వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన వివిధ నగరాలలో సేవలు అందిస్తున్న ఆటా అధ్యక్షురాలు, ఉపాధ్యక్షులు, పూర్వ అధ్యక్షులు, ట్రస్ట్ బోర్ద్ సభ్యులు,రీజనల్ అడ్వైజర్స్, రీజనల్ కోఆర్దినేటర్స్, వుమెన్ కోఆర్దినేటర్స్, స్టాండింగ్ కమిటీస్, ఆటా అడ్వైజర్స్ పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి హాజరు అయ్యారు. ఆటా అట్లాంటా సభ్యులు మర్యాదపూర్వక స్వాగత సమారోహంతో ఆహ్వానిస్తూ ఆత్మీయ ఆతిథ్యం మరియు అద్వితీయ విందు వినోదాలతో అలరించింది.

AAA.jpg

మరునాడు సెప్టెంబర్ 9న (శనివారం) ఉదయం 9 గంటలకు బోర్డు సమావేశం గణనాథుని ప్రార్థనతో ప్రారంభమయింది. ఆటా అధ్యక్షురాలు మతి మధు బొమ్మినేని సారథ్యంలో ఉపాధ్యక్షులు జయంత్ చల్లా, పూర్వ అధ్యక్షులు భువనేష్ బుజాల, హనుమంత్ రెడ్డి, కరుణాకర్ మాధవరం, సుధాకర్ పెరికారి, పరమేష్ భీమ్రెడ్డి, కార్యదర్శి రామకృష్ణ రెడ్డి ఆల, కోశాధికారి సతీష్ రెడ్డి, సంయుక్త కోశాధికారి రవీందర్ గూడూర్, ట్రస్ట్ బోర్ద్ సభ్యుల, రీజనల్ అడ్వైజర్స్, రీజనల్ కోఆర్దినేటర్స్, వుమెన్ కోఆర్దినేటర్స్, స్టాండింగ్ కమిటీస్, ఆటా అడ్వైజర్స్, అట్లాంటా ఆటా బృందం ఆధ్వర్యంలో నిర్విరామంగా సమావేశం నిర్వహించారు. ఆటా సభ్యుల ప్రోత్సాహభరిత సందేశాలు, మౌలిక సదుపాయాల చర్చ, ఆవశ్యక సేవా కార్యక్రమాలు, భారత దేశంలో డిసెంబర్ నెలలో జరుగు ఆటా వేడుకల చర్చలు, ఆమెరికన్ తెలంగాణ సొసైటి (ATS) సంస్థ విలీనం, సమావేశ సభ్యుల పరిచయం, మహాసభల తాత్కాలిక అడ్హాక్ బృందం ప్రకటన, ఆర్థిక మరియు సేవా అభివృద్ధి సంబంధిత అజెండా, రానున్న బోర్డు సమావేశపు కీలక నిర్ణయాలు, వంటి పలు కీలక అంశాల అధ్యయనంతో ప్రభావాన్వితంగా సమావేశం సాగడం హర్షణీయం.

A.jpg

ఆటా 18వ సభల కోసం నియామకమైన కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, కాన్ఫరెన్స్ డైరెక్టర్ అనిల్ బోదిరెడ్డి నేషనల్ కోఆర్డినేటర్ సాయి సుదినిలు ప్రసంగిస్తూ అట్లాంటా తరుపున అందరికీ అభినందనలు తెలిపారు. ఆటా సభలకు గాను అందరి సహాయసహకారాలను సవినయంగా కోరుతూ, సభలను గురించి పలు అంశాలను వివరించడం జరిగింది. ఆటా మ్యాట్రిమోని కమిటీ కో-చైర్ రమేష్ నల్లవోలు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అట్లాంటాలో వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేశారు. వధూవరులు, తల్లిదండ్రులు, మిత్రులు సుమారు 50 కుటుంబాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అనంతరం కమ్మని విందుతో బోర్డు సమావేశం సంపూర్ణం అయింది. మధ్యాహ్నం ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని, కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం, ఆటా 18వ కాన్ఫరెన్స్ బృందం, ట్రస్ట్ బోర్ద్ సభ్యులు, అట్లాంటా ఆటా బృందం 18వ మహాసభలను నిర్వహించు జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్ (GWCC)ని సందర్శించి అట్లాంటా నగర వీధుల్లో ప్రత్యేక సందడి చేశారు.

AA.jpg

సాయంత్రం 7 గంటలకు అట్లాంటాలోని ఫేస్ ఈవెంట్స్‌లో కాన్ఫరెన్స్ కిక్ ఆఫ్ సమావేశం అధ్యక్షురాలు మధు బొమ్మినేని, అట్లాంటా కోర్ సభ్యుల చేత సాంప్రదాయబద్దంగా జ్యోతి ప్రజ్వలనతో శ్రీకారం చుట్టారు. గణనాథుని ఆరాధనతో శుభారంభమొందిన ఆ శుభవేళ కళారాధనతో మొదలయి నీలిమ గడ్డమనుగు నేపథ్యంలో వివిధ శాస్త్రీయ జానపద, చలన చిత్ర గీతికల నృత్య ప్రదర్శనలు, సంగీత విభావరి వంటి అద్భుత కార్యక్రమాలతో ఆద్యంతం సభాసదుల సావధానతను కైవశం చేసుకుంది. ఆటా 18వ కాన్ఫరెన్స్ లోగోను ఇటీవల ఎన్నికైన అమెరికా క్రికెట్ బోర్డ్ చైర్మన్, పూర్వ ట్రస్ట్ బోర్ద్ సభ్యులు వేణు పిసికె ఆవిష్కరించారు. మధు బొమ్మినేని, జయంత్ చల్లా, కిరణ్ పాశం వేణు పిసికెను సన్మానించారు. మధు బొమ్మినేని కాన్ఫరెన్స్ సాంగ్ ఆవిష్కరించగా ప్రసిద్ధ గాయకులు, అద్భుత సంగీత సహకారాన్ని అందించిన దర్శకులు మల్లికార్జున, సాహిత్య సహకారం అందించిన మాధవి దాస్యంలను అధ్యక్షురాలు మధు బొమ్మినేని అభినందించారు. సభాసదులు ప్రతిధ్వనించు హర్షధ్వానాలతో ఆటా సభ అడ్హాక్ సభ్యులను, సలహాదారులను, పూర్వ అధ్యక్షులను, స్పాన్సర్స్‌ను మన్ననపూర్వక హర్షధ్వానాలతో సత్కరించారు.

AAAAA.jpg

ఈ శుభప్రద సాయంకాలం సుమారు 600 గౌరవ అతిథులతో కార్యక్రమం ఆద్యంతం మధురానుభూతులతో ఉల్లాసభరితంగా కొనసాగింది. శ్రావణి రాచకుల్ల సారథ్యంలో సుందర నారీమణుల వస్త్రాలంకరణ ప్రదర్శన (ఫ్యాషన్ షో) వీక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. నూతన మోహన్, జనార్ధన్ పన్నేల అద్భుత గానాలాపన, స్థానిక గాయకుల గానాలాపానతో జనరంజకంగా సాగింది ఆ శుభ సాయంకాలం. కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం 18వ కాన్ఫరెన్స్ కార్యక్రమాలు గురించి తెలుపుతు అందరికీ అభినందనలు తెలియచేశారు. అట్లాంటాలోని స్థానిక తెలుగు సంస్థలు TANA, GATA,GATeS, GTA, NATA, NATS, TTA, TDF, TAMA ప్రతినిధులను 18వ ఆటా మహాసభలకు ఆహ్వానించారు. తెలుగు సంస్థల ప్రతినిధులు కూడా 18వ ఆటా మహాసభల విజయవంతంగా సాగడానికి సహాయ సహకారాలను అందిస్తామన్నారు.

AAAAAA.jpg

అధ్యక్షురాలు మధు బొమ్మినేని మాట్లాడుతూ.. కార్యక్రమం అద్భుతంగా, అద్వితీయంగా కొనసాగడానికి కారకులైన విశిష్ఠ అతిథులకు, గౌరవ అతిథులకు, వదాన్యులకు, యూత్ వాలంటీర్స్‌కు, అట్లాంటా కోర్ సభ్యులకు, అట్లాంటా కోర్ కాన్ఫరెన్స్ దాతలకు మరియు తదితర మీడియా మిత్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. కొసమెరుపుగా కాన్ఫరెన్స్ డైరెక్టర్ అనిల్ బోదిరెడ్డి తమ కృతజ్ఞతా సందేశాన్ని అందించారు.

AAAAAAA.jpg

Updated Date - 2023-09-13T07:59:56+05:30 IST