అతడికి 13.. ఆమెకు 31.. శారీరక సంబంధంతో గర్భం.. కోర్టు షాకింగ్ తీర్పు!

ABN , First Publish Date - 2023-03-09T11:47:46+05:30 IST

31 ఏళ్ల ఓ మహిళ 13 ఏళ్ల బాలుడితో శారీరక సంబంధం ఏర్పరుచుకుంది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. ప

అతడికి 13.. ఆమెకు 31.. శారీరక సంబంధంతో గర్భం.. కోర్టు షాకింగ్ తీర్పు!

కొలరాడో: 31 ఏళ్ల ఓ మహిళ 13 ఏళ్ల బాలుడితో శారీరక సంబంధం ఏర్పరుచుకుంది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. పక్కింట్లోనే ఉండే ఆమె.. 13ఏళ్ల బాలుడిపై వ్యామోహం పెంచుకుంది. దాంతో తన కోరిక తీర్చుకునేందుకు ఆ బాలుడిని పలుమార్లు ఇంట్లో పని ఉందంటూ సహాయం చేయాల్సిందిగా తీసుకెళ్లడం చేసింది. అలా ఇంటికి తీసుకెళ్లి బాలుడితో సీక్రెట్‌గా శారీరక సంబంధం (Sexual Relation) కొనసాగించింది. దాంతో ఆమె గర్భం (Pregnant) దాల్చింది. ఇక వారిద్దరి మధ్య చాలా వయసు గ్యాప్ ఉండడంతో ఎవరికీ పెద్దగా అనుమానం కూడా వచ్చేది కాదు. బాలుడితో కూడా ఈ విషయం ఎవరికి చెప్పొదని బెదిరించిందామె. అయితే, ఆమె గర్భవతి కావడంతో చుట్టుపక్కల వారికి అనుమానం కలిగింది. అదే సమయంలో బాలుడి పేరెంట్స్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని, కోర్టులో హాజరుపరిచారు. ఈ వ్యవహారంపై న్యాయస్థానం తాజాగా షాకింగ్ తీర్పును వెల్లడించింది. అగ్రరాజ్యం అమెరికాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Andrea-Serrano.jpg

వివరాల్లోకి వెళ్తే.. యూఎస్‌లోని కొలరాడోలో (Colorado) నివాసం ఉండే ఆండ్రియా సెరానో (31) అనే మహిళకు తన పొరుగింటిలో ఉండే 13 ఏళ్ల అబ్బాయి అంటే చాలా ఇష్టం. అతడిపై వ్యామోహం పెంచుకున్న ఆమె.. తరచుగా ఆ పని ఈ పనంటూ ఇంటికి తీసుకెళ్లేది. అలా తనవద్దే బాలుడు ఎక్కువ సమయం గడిపేలా చేసేది. దాంతో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ క్రమంలో ఒకరోజు ఆండ్రియా ఆ బాలుడితో తన లైంగిక వాంఛ తీర్చుకుంది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించింది. ఆ తర్వాత కూడా వారి మధ్య శారీరక సంబంధం అలాగే కొనసాగింది. రోజులు గడుస్తున్న కొద్ది బాలుడు కూడా తన ఇంట్లో కంటే ఆండ్రియా ఇంట్లోనే ఎక్కువగా ఉండడం మొదలెట్టాడు. బయటివారికి కూడా వారిద్దరీ మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉండడంతో ఎవరికి అనుమానం రాలేదు. ఈ క్రమంలో ఆండ్రియా గర్భం దాల్చింది. దాంతో అందరూ షాక్ అయ్యారు. ఇంకేముంది.. ఎప్పుడూ బాలుడే ఆమె ఇంటికి వెళ్తుండడంతో అతడి వల్లే గర్భం దాల్చిందనే విషయం అందరికీ అర్థమైపోయింది. బాలుడి పేరెంట్స్ ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు ఆండ్రియాను అదుపులోకి తీసుకున్నారు. మైనర్‌పై లైంగిక దాడి (Sexual Assault) అనే ఆరోపణలపై ఆమెను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పోలీసుల విచారణలో చాలా కాలంగా బాలుడితో ఆండ్రియా లైంగిక సంబంధం కొనసాగిస్తున్నట్లు తేలింది.

ఇది కూడా చదవండి: 43 లక్షలు దాటిన కువైత్‌ జనాభా.. ప్రవాసుల వాటా ఎంతో తెలిస్తే ఆశ్చర్యం వేయక మానదు..!

తాజాగా ఆమెను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానంలో ఆండ్రియా బాలుడితో శారీరక సంబంధం ఉన్న విషయం నిజమేనని అంగీకరించింది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఆ బాలుడే తండ్రి అని తెలిపింది. ఆమె మాటలు విన్న జడ్జీలు తలల పట్టుకున్నారు. అయితే, ఆమె ఆరోగ్యపరిస్థితి దృష్ట్యా విడుదల చేసేందుకు న్యాయమూర్తి మొగ్గచూపారు. చివరకు ఆండ్రియాను రూ.57లక్షల పూచీకత్తుపై విడుదల చేశారు. అయితే, పుట్టబోయే బిడ్డకు 13ఏళ్ల బాలుడే తండ్రిగా పరిగణించాల్సిందిగా న్యాయస్థానం తీర్పునిచ్చింది.

ఇది కూడా చదవండి: ఇండియాలో పసిడి విక్రయాలపై కొత్త నిబంధన.. దుబాయిలో సేల్స్‌పై ప్రభావం చూపనుందా..? నిపుణులు చెబుతున్నదేమిటంటే..

Updated Date - 2023-03-09T12:00:21+05:30 IST