Work Visa: ప్రవాసుల వర్క్ పర్మిట్లపై కువైత్ కీలక నిర్ణయం.. ఆ సర్వీస్ బ్యాన్!

ABN , First Publish Date - 2023-09-07T11:05:06+05:30 IST

కువైత్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (Public Authority for Manpower) ప్రవాసులకు ఇచ్చే వర్క్ పర్మిట్ల విషయంలో తాజాగా కీలక ప్రకటన చేసింది.

Work Visa: ప్రవాసుల వర్క్ పర్మిట్లపై కువైత్ కీలక నిర్ణయం.. ఆ సర్వీస్ బ్యాన్!

కువైత్ సిటీ: కువైత్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (Public Authority for Manpower) ప్రవాసులకు ఇచ్చే వర్క్ పర్మిట్ల విషయంలో తాజాగా కీలక ప్రకటన చేసింది. 'వర్క్ పర్మిట్ల సవరణ'ను పూర్తిగా బ్యాన్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఇకపై వర్క్ పర్మిట్‌లోని పేరు, పుట్టిన తేదీ, జాతీయత ఇలా ఏ వివరాలను సవరించడానికి వీల్లేదని తెలిపింది. ఒకవేళ యజమాని వర్కర్ డేటాను సవరించాలంటే మొదట వీసా క్యాన్సిలేషన్ సర్వీస్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆ తర్వాత వర్కర్‌తో కలిసి సహేల్ యాప్ ద్వారా గానీ, అంతర్గత మంత్రిత్వశాఖ ద్వారా గానీ కొత్త పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఈ కార్యక్రమాన్ని పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్‌పవర్, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. రిక్రూట్‌మెంట్ పర్మిట్‌లు పొందిన కొందరు.. మోసపూరితంగా కార్మికులను దేశానికి తీసుకురావడానికి గతంలో చేసిన అవకతవకలను నిరోధించడమే దీని ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

ఇక ఇటీవల వర్క్ పర్మిట్ల (Work Permits) విషయంలోనూ కువైత్ సర్కార్ (Kuwait Govt) కీలక మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఇకపై 'వర్క్ పర్మిట్ క్యాన్సిలేషన్', 'వర్క్ పర్మిట్ల సవరణ' సర్వీసులను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చింది. సహేల్ యాప్ (Sahel App) ద్వారా కంపెనీలు ఈ ఆన్‌లైన్ సర్వీసులను పొందవచ్చని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ వెల్లడించింది. ఇలా ఆన్‌లైన్‌లో కంపెనీలు వర్క్ పర్మిట్లకు సంబంధించి చేసుకున్న దరఖాస్తులను అధికార యంత్రాంగం సమీక్షించి తదనుగుణంగా అప్‌డేట్ చేస్తుందని మంత్రిత్వశాఖ తెలిపింది.

Green Card: అమెరికా గ్రీన్‌కార్డు అందుకోకుండానే.. 4ల‌క్ష‌ల మంది భార‌తీయులు చనిపోతారట.. నివేదికలో విస్మయకర విషయాలు..!

Updated Date - 2023-09-07T11:15:24+05:30 IST