Obesity : వామ్మో.. ఒబేసిటీ కారణంగా ఆ ప్రాణాంతక వ్యాధి వస్తుందని తెలిస్తే.. వెంటనే తగ్గేందుకు ట్రై చేస్తారు..
ABN , First Publish Date - 2023-02-24T12:28:16+05:30 IST
ఒబేసిటీని తగ్గించుకోవాలని ఎవరు అనుకోరు? రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ శరీర తీరో లేదంటే ప్రయత్న లోపమో కానీ ఒబేసిటీ మాత్రం ఓ పట్టాన తగ్గదు. పెరిగినంత ఈజీ కాదు తగ్గడం. కానీ ఒబేసిటీ కారణంగా వచ్చే ఓ ప్రాణాంతక వ్యాధి గురించి తెలిస్తే మాత్రం తగ్గడమే లక్ష్యంగా పెట్టుకుంటారు.
Obesity : ఒబేసిటీని తగ్గించుకోవాలని ఎవరు అనుకోరు? రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ శరీర తీరో లేదంటే ప్రయత్న లోపమో కానీ ఒబేసిటీ మాత్రం ఓ పట్టాన తగ్గదు. పెరిగినంత ఈజీ కాదు తగ్గడం. కానీ ఒబేసిటీ కారణంగా వచ్చే ఓ ప్రాణాంతక వ్యాధి గురించి తెలిస్తే మాత్రం తగ్గడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. ఊబకాయం అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాధారణ ఆరోగ్య సమస్యలలో ఒకటి. శరీరంలో కొవ్వు అధికంగా చేరితే అది ఒబేసిటీకి దారి తీస్తుంది. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్, హై బీపీ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. తగినంత శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువ కేలరీలు తీసుకోవడం వంటివి అధిక బరువుకు కారణమవుతాయి.
బరువు అధికంగా పెరగడం అనేది ఎముకల ఆరోగ్యాన్ని సైతం దెబ్బతీస్తుంది. కీళ్లకు హాని కలిగిస్తుంది. అంతేకాదు.. ఒబేసిటీ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధికి సైతం కారణమవుతుందట. ఇది ఒక ప్రముఖ న్యూట్రిషియనిస్ట్ స్వయంగా చెప్పారు. ఒబేసిటీ అనేది క్యాన్సర్ ముప్పును మరింత పెంచుతుందట. మన శరీరంలో ఫ్యాట్ ఎక్స్‌ట్రా లేయర్స్‌ను తీసుకోవడం వలన ఇన్సులిన్ నిరోధించడంలో విఫలమవుతుంది. దీంతో వేగంగా డివైడ్ చేయడానికి కారణమయ్యే శరీరంలోని కణాలు గ్లూకోజ్‌ను సమర్థవంతంగా తీసుకోవడంలో విఫలమవుతాయని.. వెరసి చివరకు ఇది క్యాన్సర్‌కు దారి తీస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఒబేసిటీ ఉన్న వ్యక్తులు కూడా వారి రక్తంలో అధిక స్థాయి ఇన్ఫ్లమేటరీ సైటోకిన్‌లను కలిగి ఉంటారు. ఇది దీర్ఘకాలిక మంటను కలిగిస్తుంది. ఋతుక్రమం ఆగిపోయిన మహిళల్లో ఊబకాయం అనేది అండాశయ, రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. జీవక్రియను పెంచేందుకు వాటర్ థెరపీ అత్యంత ప్రభావవంతమైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. చల్లటి నీటిని తాగడం వల్ల ఒక గంట పాటు జీవక్రియ 25% వరకు పెరుగుతుందని చెబుతున్నారు. ఎందుకంటే నీరు శరీరంలో వేడి ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. తద్వారా మన శరీరంలో ఎక్కువ శక్తి ఖర్చు అవుతుంది. మొత్తానికి క్యాన్సర్‌కు ఒబేసిటీ కూడా ఒక కారణమే. కాబట్టి ఈ ప్రాణాంతక రోగానికి చెక్ పెట్టాలంటే బరువును సైతం అదుపులో ఉంచుకోవాల్సిందే.