Share News

Superfood: గంగవల్లి కూరను శీతాకాలంలో తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటంటే...!!

ABN , Publish Date - Dec 26 , 2023 | 12:51 PM

ఆకుకూరల్లో ముఖ్యంగా తోటకూర, బచ్చలి కూర, గంగవల్లి కూర, మెంతి కూర ఇలాంటివి తీసుకోవడం మంచిది. వీటిల్లో విటమిన్లు, మినరల్స్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు గుణాలున్నాయి.

Superfood: గంగవల్లి కూరను శీతాకాలంలో తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటంటే...!!
eating purslane in winters

శీతాకాలాన్ని కూరగాయల సీజన్ అంటారు. చలికాలంలో వేడి వేడిగా ఏది తిన్నా, త్వరగా జీర్ణం అయిపోతుంది. అయితే పోషకాలను అందించే ఆహారం తీసుకోవడం ఎంతైనా ముఖ్యం. అయితే ఆకుకూరల్లో ముఖ్యంగా తోటకూర, బచ్చలి కూర, గంగవల్లి కూర, మెంతి కూర ఇలాంటివి తీసుకోవడం మంచిది. వీటిల్లో విటమిన్లు, మినరల్స్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు గుణాలున్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ ఆకు కూరల్లో ప్రధానంగా గంగవల్లి కూర తీసుకోవడం వల్ల కలిగే లాభాలను గురించి తెలుసుకుందాం.

ఎముకలు..

ఆహారంలో గంగవల్లి కూరను తీసుకోవడం వల్ల ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా, దృఢంగా తయారవుతాయి. గంగవల్లలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఈ శీతాకాలంలో ఎముకలకు బలాన్ని ఇవ్వడమే కాకుండా దంతాలకు కూడా పటుత్వాన్ని ఇస్తుంది. పంటి నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

రోగనిరోధక శక్తి..

బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు గంగవల్లి కూర తీసుకోవడం వల్ల యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలోనూ సహకరిస్తుంది.

ఇది కూడా చదవండి: చలికాలంలో రోజూ బాదంపప్పు తీసుకోవడం వల్ల కలిగే 10 ప్రయోజనాలు..


గుండె

గంగవల్లి కూర ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ లు శరీరంలోని ఎల్ డి ఎల్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడతాయి. గుండె ఆరోగ్యం కూడా కాపాడుతుంది.

కళ్లు..

కంటి ఆరోగ్యానికి మంచి సపోర్ట్ నిస్తుంది. గంగవల్లి కూరలో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యంలో సహకరిస్తాయి.

ఇనుము

ఐరన్ అధికంగా ఉండే గంగవల్లి కూరను శీతాకాలంలో తీసుకోవడం వల్ల ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు.


మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 26 , 2023 | 01:19 PM