Share News

Mutton Paya: మటన్ పాయ సూప్‌ను తాగితే.. ఎముక పుష్టి పెరుగుతుందా..? దీనిని ఇంట్లో ఎలా తయారుచేయాలంటే..!

ABN , Publish Date - Dec 26 , 2023 | 03:59 PM

మటన్ పాయా సూప్ కాస్త నీరసంగా ఉన్నా, కాళ్ళల్లో బలం తగ్గినా, ఎముక పుష్టికోసం చాలా వరకూ మటన్ పాయాను ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. ఈ సూప్ ని గొర్రె కాళ్లతో తయారుచేస్తారు. దీనిని లాంబ్ ట్రాటర్స్ అని కూడా పిలుస్తారు. ఇది చాలా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఎన్నో పోషకాలను కలిగిన ఈ సూప్ పిల్లలకు పెద్దలకు ఆరోగ్యపరంగా మంచి సపోర్ట్ ఇస్తుంది.

Mutton Paya: మటన్ పాయ సూప్‌ను తాగితే.. ఎముక పుష్టి పెరుగుతుందా..? దీనిని ఇంట్లో ఎలా తయారుచేయాలంటే..!
Mutton Paya

మటన్ పాయా సూప్ కాస్త నీరసంగా ఉన్నా, కాళ్ళల్లో బలం తగ్గినా, ఎముక పుష్టికోసం చాలా వరకూ మటన్ పాయాను ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. ఈ సూప్ ని గొర్రె కాళ్లతో తయారుచేస్తారు. దీనిని లాంబ్ ట్రాటర్స్ అని కూడా పిలుస్తారు. ఇది చాలా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఎన్నో పోషకాలను కలిగిన ఈ సూప్ పిల్లలకు పెద్దలకు ఆరోగ్యపరంగా మంచి సపోర్ట్ ఇస్తుంది.

పాయా సూప్ రెసిపీ కోసం కావలసినవి..

లాంబ్ ట్రాటర్స్ ½ అంగుళాల ముక్కలుగా కట్ 2

స్ప్లిట్ బెంగాల్ గ్రాము 1 టేబుల్ స్పూన్

వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్ చూర్ణం

అల్లం ½ అంగుళం సన్నని కుట్లుగా కట్ చేయాలి.

బే ఆకులు 2

పచ్చి ఏలకులు 2-3

నల్ల మిరియాలు 8-10

లవంగాలు 4-5

పచ్చిమిర్చి 4-5 ముక్కలు

రుచికి ఉప్పు

పసుపు పొడి

1. మటన్ కాళ్లను కడిగి శుభ్రం చేసుకోవాలి.

2. నీరు, ఉప్పు, నల్ల మిరియాలు, అల్లంతో పాటు మటన్ ముక్కలను ప్రెజర్ కుక్కర్ లో వేసి 40 నుంచి 45 నిమిషాలపాటు ఉడికించాలి.

తయారు చేసే పద్ధతి..

ప్రెషర్ కుక్కర్‌లో నూనె వేసి వేడయ్యాక అందులో వెల్లుల్లి, అల్లం వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. పలావ్ ఆకులు, పచ్చి ఏలకులు, లవంగాలు, పచ్చిమిర్చి వేయాలి. ఇవి తక్కువ ముదురురంగు వచ్చే వరకూ వేగించాలి.

ఇది కూడా చదవండి: ఆరోగ్యానికి మంచిదని తినేస్తాం కానీ ఈ ఏడు పదార్థాలు తీసుకుంటే...!!

తయారుచేసిపెట్టుకున్న పదార్థాలన్నీ వేసి, వాటితో పాటు మటన్ కాళ్ళను కూడా వేసుకుని, నాలుగు కప్పుల నీరు వేసి బాగా కలపాలి. ఉప్పు, పసుపు వేసి కలపాలి. మంటమీద 2 సార్లు విజిల్స్ వచ్చే వరకూ కుక్కుర్ మీద ఉడికించాలి.

ఆవిరి అంతా పోయిన తర్వాత బాగా ఉడికిన సూప్ ని మరో గిన్నెలోనికి మార్చి, సర్వ్ చేసుకోవాలి. పాయా సూర్ చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది. పోషకాలతో నిండి ఉంటుంది కనుక ఆరోగ్యానికి మంచి సపోర్ట్ ఇస్తుంది.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 26 , 2023 | 04:35 PM