Share News

pink guava: గులాబి జామకాయలు తింటే మధుమేహం నుంచి ఉపశమనం కలుగుతుందట.. వీటితో ఇంకా..!!

ABN , Publish Date - Dec 27 , 2023 | 04:36 PM

పింక్ జామ మామూలు పచ్చ జామకాయలు తినడం అలవాటైనవారు ఈ గులాబి జామను తినడానికి అంతగా ఇష్టపడరు. పచ్చ జామలో ఉన్న తీపిదనం గులాబి జామలో లేకపోయినా ఇందులో చాలా ప్రయోజనాలున్నాయి. పైకి పచ్చగా కనిపించే ఈ గులాబి జామ లోపలి భాగం అంతా చక్కని గులాబిరంగులో ఉంటుంది.

pink guava: గులాబి జామకాయలు తింటే మధుమేహం నుంచి ఉపశమనం కలుగుతుందట.. వీటితో ఇంకా..!!
Pink guava

పింక్ జామ మామూలు పచ్చ జామకాయలు తినడం అలవాటైనవారు ఈ గులాబి జామను తినడానికి అంతగా ఇష్టపడరు. పచ్చ జామలో ఉన్న తీపిదనం గులాబి జామలో లేకపోయినా ఇందులో చాలా ప్రయోజనాలున్నాయి. పైకి పచ్చగా కనిపించే ఈ గులాబి జామ లోపలి భాగం అంతా చక్కని గులాబిరంగులో ఉంటుంది. కాస్త గట్టిదనం కూడా తక్కువగానే ఉంటుంది. గులాబి జామపండ్లలో పోషకాలతో పాటు కాల్షియం, మాంసకృతులు, ఫైబర్ అధికంగా ఉన్నాయి. ఇవి మధుమేహాన్ని తగ్గించడంలో సహకరిస్తాయి. పింక్ జామకాయతో కలిగే ఆరోగ్యప్రయోజనాలను తెలుసుకుందాం.

గులాబి జామలో పోషకాలు.. గులాబీ రంగు జామ అనేక పోషకాలతో నిండి ఉంది. ఇందులో

కాల్షియం 14.22 మిల్లిగ్రాములు

ఐరన్ 0.40 మిల్లిగ్రాములు

మెగ్నిషియం 13.26 మిల్లిగ్రాములు

పొటాషియం 270 మిల్లిగ్రాములు

ప్రోటీన్ 1.19 మిల్లిగ్రాములు

నీటి శాతం 81.22 మిల్లిగ్రాములు

ఫైబర్ 7.39 మిల్లిగ్రాములు

కార్బోహైడ్రేట్ 9.14 గ్రాములు

మిటమిన్ సి 228 మిల్లిగ్రాములు

పింక్ జామ ప్రయోజనాలు ఏంటంటే...

జామకాయలో అనేక పోషకాలున్నాయి. ఇది ఆరోగ్యాన్ని పెంచడంలో సహకరిస్తుంది. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది.

చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాకరిస్తుంది.

100గ్రాములకి దాదాపు 7 గ్రాముల పీచుపదార్థం కలిగి ఉంటుంది. ఇందులో పెక్టిన్ వంటి ఇతర ఫైబర్ కూడా ఉంటుంది. ఇది ఫైబర్ కొలస్ట్రాల్ LDL స్థాయిలను తగ్గించడంలో సహకరిస్తుంది.

రోగనిరోధక శక్తికి..

పింక్ జామలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. 100 గ్రాముల జామలో 228 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది.

చర్మం దెబ్బతినకుండా..

బీటా కెరోటిన్ లైకోపీన్ లతో ఉంటుంది. ఇది చర్మం దెబ్బతినకుండా ఫ్రీరాడిక్స్ తో పోరాడటానికి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని దెబ్బతినకుండా రక్షణనిస్తుంది.

ఇది కూడా చదవండి: గ్యాస్ నుంచి ఉపశమనానికి ఈ 5 యోగా భంగిమలు చేస్తే చాలు..


బరువు తగ్గడంలో

అధిక ఫైబర్ కారణంగా నీటి కంటెంట్ కారణంగా గులాబి జామ బరువుతగ్గడంలో ముఖ్యంగా పనిచేస్తుంది.ల ఇందులోని పోషకాలు మధ్యాహ్న స్నాక్స్ గా తీసుకున్నప్పుడు శక్తిని ఇవ్వడంలో సహకరిస్తాయి. అలాగే ఈ జామకు మసాలా చల్లి తీసుకున్నా కూడా రుచిగా ఉంటాయి.

రక్తపోటు తగ్గుతుంది.

పింక్ జామలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో నరాల సిగ్నలింగ్, కండరాల సంకోచాల సరైన పనితీరును ప్రోత్సహిస్తుంది.

మధుమేహానికి సపోర్ట్..

పింక్ జామ, పుష్కలంగా ఫైబర్, నీటి కంట్ కారణంగా మధుమేహం ఉన్నవారికి గ్యాస్ట్రిక్ ఖాళీని నెమ్మదించేట్టు చేస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్రైక్ లను నివారించడంలో సహకరిస్తుంది.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Dec 27 , 2023 | 04:43 PM