Actor Prakash Raj: మత రాజకీయాలకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రకాష్ రాజ్ పిలుపు

ABN , First Publish Date - 2023-05-10T08:29:15+05:30 IST

బుధవారం ప్రారంభమైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వంలో సెలబ్రిటీలు, కేంద్రమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు...

Actor Prakash Raj: మత రాజకీయాలకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రకాష్ రాజ్ పిలుపు
Actor Prakash Raj casting his vote

బెంగళూరు : బుధవారం ప్రారంభమైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వంలో సెలబ్రిటీలు, కేంద్రమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రముఖ సినీనటుడు ప్రకాష్ రాజ్(Actor Prakash Raj) బుధవారం బెంగళూరులో ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘మనం మత రాజకీయాలకు వ్యతిరేకంగా ఓటు వేయాలి... కర్ణాటక ఉజ్వలంగా ఉండాలి’’(Vote against communal politics) అని నటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్(Union Finance Minister and BJP leader Nirmala Sitharaman) బుధవారం బెంగళూరులోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఓటు వేసిన తర్వాత నిర్మలా సీతారామన్ తాను ఓటు వేసినట్లు వీడియోను ట్వీట్ చేశారు. కన్నడ సినీనటి అమూల్య(Kannada actress Amulya) తన భర్తతో కలిసి బెంగళూరులోని ఆర్ఆర్ నగర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.

Updated Date - 2023-05-10T08:38:08+05:30 IST