Share News

Vande Bharat Trains: అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం.. ప్రత్యేక వందే భారత్‌ రైళ్లు

ABN , First Publish Date - 2023-11-15T07:12:45+05:30 IST

శబరిమల ఉత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం చెన్నై - తిరునల్వేలి(Chennai - Tirunelveli) మధ్య ప్రత్యేక వందే భారత్‌ రైళ్లు నడపనున్నట్లు

Vande Bharat Trains: అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం.. ప్రత్యేక వందే భారత్‌ రైళ్లు

పెరంబూర్‌(చెన్నై): శబరిమల ఉత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం చెన్నై - తిరునల్వేలి(Chennai - Tirunelveli) మధ్య ప్రత్యేక వందే భారత్‌ రైళ్లు నడపనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది. నెం.06067 చెన్నై ఎగ్మూర్‌ - తిరునల్వేలి ప్రత్యేక వందే భారత్‌ రైలు ఈ నెల 16, 23, 30, డిసెంబరు 7, 14, 21, 28 తేదీల్లో ఉదయం 6 గంటలకు ఎగ్మూర్‌లో బయల్దేరి మధ్యాహ్నం 2.15 గంటలకు తిరునల్వేలి చేరుకుంటుంది. అలాగే, నెం.06068 తిరునల్వేలి - చెన్నై ఎగ్మూర్‌ ప్రత్యేక వందే భారత్‌ రైలు ఈ నెల 16, 23, 30, డిసెంబరు 7, 14, 21, 28 తేదీల్లో మధ్యాహ్నం 3 గంటలకు తిరునల్వేలిలో బయల్దేరి రాత్రి 11.15 గంటలకు ఎగ్మూర్‌ చేరుకుంటుంది. ఈ రైళ్లు తాంబరం, విల్లుపురం, తిరుచ్చి, దిండుగల్‌, మదురై, విరుదునగర్‌ స్టేషన్లలో ఆగుతాయి.

తాంబరం - సంత్రాగచ్చి....

- నెం.06079 తాంబరం-సంత్రాగచ్చి ప్రత్యేక సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ నెల 15, 22 తేదీల్లో మధ్యాహ్నం 1 గంటకు తాంబరంలో బయల్దేరి మరుసటిరోజు రాత్రి 8.45 గంటలకు సంత్రాగచ్చి చేరుకుంటుంది. అలాగే, నెం.06080 సంత్రాగచ్చి - తాంబరం(Santragachchi - Tambaram) ప్రత్యేక సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈనెల 16, 23 తేదీల్లో రాత్రి 11.40 గంటలకు సంత్రాగచ్చిలో బయల్దేరి మూడవరోజు ఉదయం 9.35 గంటలకు తాంబరం చేరుకుంటుంది. ఈ రైళ్లు చెన్నై ఎగ్మూర్‌, గూడురు, విజయవాడ(Guduru, Vijayawada), రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ(Rajahmundry, Samarlakota, Duvvada), సింహాచలం నార్త్‌, విజయనగరం, పలాస, కుర్దా రోడ్డు, భువనేశ్వర్‌, కటక్‌, భద్రక్‌, బాలాసోర్‌, ఖరగ్‌పూర్‌ స్టేషన్లలో ఆగుతాయి.

- నెం.06081 తాంబరం - భువనశ్వేర్‌ ప్రత్యేక సూపర్‌ఫాస్ట్‌ రైలు ఈ నెల 21న మధ్యాహ్నం 1 గంటకు తాంబరంలో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 9.55 గంటలకు భువనేశ్వర్‌ చేరుకుంటుంది. అలాగే, నెం.06082 భువనేశ్వర్‌ - తాంబరం ప్రత్యేక సూపర్‌ఫాస్ట్‌ రైలు ఈ నెల 22వ తేది మధ్యాహ్నం 12.50 గంటలకు భువనేశ్వర్‌లో బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12 గంటలకు తాంబరం చేరుకుంటుంది.

Updated Date - 2023-11-15T07:12:46+05:30 IST