Share News

Dharmendra Pradhan: ఎన్సీఈఆర్టీలో పేరు మార్పుపై అనవసర వివాదం సృష్టిస్తున్నారు: ధర్మేంద్ర ప్రదాన్

ABN , First Publish Date - 2023-10-27T10:20:26+05:30 IST

ఎన్సీఆర్టీ(NCERT)లో పేరు మార్పుపై కొందరు అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ మండిపడ్డారు. భారత్, ఇండియా మధ్య తేడా ఏం లేదని.. దీనిపై కొందరు కాంట్రవర్సీ చేస్తున్నారని ఆరోపించారు.

Dharmendra Pradhan: ఎన్సీఈఆర్టీలో పేరు మార్పుపై అనవసర వివాదం సృష్టిస్తున్నారు: ధర్మేంద్ర ప్రదాన్

ఢిల్లీ: ఎన్సీఆర్టీ(NCERT)లో పేరు మార్పుపై కొందరు అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ మండిపడ్డారు. భారత్, ఇండియా మధ్య తేడా ఏం లేదని.. దీనిపై కొందరు కాంట్రవర్సీ చేస్తున్నారని ఆరోపించారు. నిరాశతో ఉన్న కొందరు ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఎద్దేశా చేశారు. ఎన్సీఈఆర్టీ పుస్తకాలలో ఇండియా స్థానంలో భారత్ అని పేరు మార్చాలని కమిటీ నిర్ణయించిన తరువాత మంత్రి ఈ కామెంట్లు చేశారు. ఎన్సీఈఆర్టీ నిర్ణయంపై దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. ఇండియా కూటమి సభ్యులు దీనిని రాజకీయ జిమ్మిక్కుగా.. చరిత్రను వక్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గుజరాత్‌లోని నర్మదా జిల్లాలో జాతీయ విద్యా విధానం (NCP)-2020 అమలుపై వైస్ ఛాన్స్‌లర్ సదస్సులో ప్రసంగించిన వక్తలు.. దేశాన్ని భారత్ అని పిలవాలా.. లేదా ఇండియా అని పిలవాలా అనే అంశంపై కొంత కాలంగా వివాదం నడుస్తోందన్నారు. మన దేశానికి వలస వచ్చిన బ్రిటిషర్లు ఇండియా అనే పేరుపెట్టారని, ఇప్పుడు ఆ పదం అనవసరమని పేర్కొన్నారు.భారత రాజ్యాంగం రెండు పదాలకు సమ ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. కొందరు అనవసర వివాదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. NCERT నివేదికపై ఏడుగురు సభ్యుల ప్యానెల్ ఏకగ్రీవ సిఫారసు చేసిందని.. ఆ సిఫారుసుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎన్సీఈఆర్టీ ఛైర్మన్ దినేష్ సక్లానీ స్పష్టం చేశారు.


ఖండించిన ప్రతిపక్షాలు..

ఇటీవల పుస్తకాల్లో ఇండియా స్థానంలో భారత్ అనే పేరు మాత్రమే వాడాలని మార్గదర్శకాలు జారీ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ ప్రకారం.. ఇండియా అంటే భారత్ యూనియన్ అని నిర్వచించింది. ఎన్సీఈఆర్టీ ప్యానెల్ చేసిన ప్రతిపాదనను సభ్యులు ఆమోదించడంతో ఇకపై పుస్తకాల్లో ఇండియా అనే పేరు మాయం కానుంది. ప్యానెల్ సభ్యుల్లో ఒకరైన ఇస్సాక్ మాట్లాడుతూ.. కొత్త పుస్తకాల్లో పేర్లు మార్చాలని గతంలోనే ప్రతిపాదన ఉండిందని.. ఇప్పుడు ఆమోదం తెలపడంతో ప్రతిపాదన అమల్లోకి రానున్నట్లు చెప్పారు. అయితే ప్రతిపక్ష కూటమికి ఇండియా అనే పేరు పెట్టినప్పటి నుంచి దేశంలోని చాలా ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇండియా అనే పేరు వాడట్లేదు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) జీ 20 విందు ఆహ్వాన పత్రికలో కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరుకు బదులు భారత రాష్ట్రపతి అని ఉండటంతో వివాదానికి దారి తీసింది. సెప్టెంబర్ లో ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో జరిగిన జీ 20 లీడర్స్ సమ్మిట్ లో ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నప్పుడు టేబుల్ పై భారత్ నేమ్ ప్లేట్ ని ప్రదర్శించారు. ఇలా చాలా ప్రాంతాల్లో పేరు మార్పు ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తున్న కాంగ్రెస్, తమ కూటమిని చూసి మోదీ భయపడుతున్నారని ఎద్దేవా చేసింది. తాజాగా ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో సైతం పేర్లు మార్చడంపై ఇండియా కూటమి(INDIA Alliance) నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-10-27T10:24:20+05:30 IST