Share News

I.N.D.I.A. bloc: ఇండియా కూటమిలో మరో చిచ్చు?..23 స్థానాల్లో పోటీ చేస్తామన్న శివసేన

ABN , Publish Date - Dec 22 , 2023 | 04:05 PM

లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంకకాల అంశం 'ఇండియా' కూటమికి మఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి తలనొప్పి కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో భాగస్వామ్య పార్టీలతో పొత్తుల వ్యవహారం ఇంకా మంతనాల స్థాయిలోనే ఉండగానే మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేన 23 లోక్‌సభ స్థానాలలో తాము పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది.

I.N.D.I.A. bloc: ఇండియా కూటమిలో మరో చిచ్చు?..23 స్థానాల్లో పోటీ చేస్తామన్న శివసేన

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంకకాల అంశం 'ఇండియా' (I.N.D.I.A.) కూటమికి మఖ్యంగా కాంగ్రెస్ (Congress) పార్టీకి తలనొప్పి కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో భాగస్వామ్య పార్టీలతో పొత్తుల వ్యవహారం ఇంకా మంతనాల స్థాయిలోనే ఉండగానే మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాకరే (Uddhav Balasaheb Thackeray) సారథ్యంలోని శివసేన (Shiv Sena) శుక్రవారంనాడు చేసిన ప్రకటన ఈ అనుమానాలకు తావిస్తోంది. మహారాష్ట్రలోని 48 స్థానాల్లో 23 స్థానాల్లో తాము పోటీ చేయనున్నట్టు ఉద్ధవ్ వర్గం శివసేన ప్రకటించింది. ఆ రాష్ట్రంలో శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీ (శరద్ పవార్ వర్గం) భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయి. ఇండియా కూటమిలోనూ ఈ మూడు పార్టీలు కొనసాగుతున్నాయి.


గత లోక్‌సభ ఎన్నికల్లో శివసేన, బీజేపీ కలిసి మహారాష్ట్రలో పోటీ చేశాయి. బీజేపీ 25 స్థానాల్లో పోటీ చేయగా, తక్కిన 23 స్థానాల్లో శివసేన పోటీ చేసింది. బీజేపీ 23 స్థానాలు గెలుచుకోగా, శివసేన 18 సీట్లు గెలుచుకుంది.


కాంగ్రెస్ ఏమంటోంది?

మరోవైపు, భాగస్వామ్య పార్టీలతో పొత్తుల వ్యవహారంలో అంతా సజావుగానే జరుగుతుందని కాంగ్రెస్ చెబుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను త్వరలోనే ఖరారు చేస్తామని, బీజేపీ, దాని ప్రత్యర్థి పార్టీలపై ఇండియా బ్లాక్ పోటీకి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. ఇండియా బ్లాక్ భాగస్వామ్యుల మధ్య సీట్ల పంపకాలపై అడిగినప్పుడు, తాము ఇప్పటికే అలయెన్స్ కమిటీని ఏర్పాటు చేశామని, కమిటీకి పార్టీ చీఫ్ స్పష్టమైన ఆదేశాలిచ్చారని, ఈ నెలలోనే భాగస్వామ్య పార్టీలతో చర్చలు జరుగుతాయని వివరించింది.


సంప్రదాయ సీట్లపై పట్టుబడుతున్న టీఎంసీ, ఎస్పీ..

కాగా, సీట్ల షేరింగ్‌ అంశపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సీట్ల షేరింగ్‌పై మాట్లాడుతూ, దీనిపై సోనియాగాంధీ, మల్లికార్జున్ ఖర్గే, మహారాష్ట్రకు చెందిన ఇంతర నేతలతో మాట్లాడుతున్నామని, తదుపరి చర్చలు న్యూఢిల్లీలో జరుగుతాయని చెప్పారు. ఇతర భాగస్వామ్య పార్టీలైన ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ, పశ్చిమబెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తమ సంప్రదాయ సీట్లకు కట్టుబడి ఉంటామని చెబుతున్నాయి.

Updated Date - Dec 22 , 2023 | 04:05 PM