Train: చెన్నై - హైదరాబాద్ ఎక్స్ప్రెస్కు అదనపు హాల్టులు
ABN , First Publish Date - 2023-07-04T10:13:07+05:30 IST
చెన్నై సెంట్రల్ నుంచి హైదరాబాద్(Chennai Central to Hyderabad) వెళ్లే ఎక్స్‌ప్రెస్ (12603)కు మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో
చెన్నై, (ఆంధ్రజ్యోతి): చెన్నై సెంట్రల్ నుంచి హైదరాబాద్(Chennai Central to Hyderabad) వెళ్లే ఎక్స్‌ప్రెస్ (12603)కు మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ప్రయోగాత్మకంగా అదనపు హాల్టులు కల్పించినట్టు దక్షిణ రైల్వే ప్రకటించింది. ఈనెల 5వ తేదీ నుంచి బయలుదేరనున్న రైలు ఆయా స్టేషన్లలో అదనంగా ఆగనుంది. అదే విధంగా తాంబరం నుంచి హైదరాబాద్ వెళ్లే ‘చార్మినార్ ఎక్స్‌ప్రెస్’ (12759) డోర్నకల్‌లో ఆగనుంది. అంతేగాక కాచిగూడ - చెంగల్పట్టు ఎక్స్‌ప్రెస్ (17652) కోడూరులో ఆగనుంది. అదే విధంగా చెంగల్పట్టు - కాకినాడ పోర్ట్ ‘సర్కార్ ఎక్స్‌ప్రెస్’ (17643) న్యూ గుంటూర్, మంగళగిరి స్టేషన్లలో ఆగనుంది.
రేపు సంత్రాగచ్చి రైలు రద్దు
చెన్నై, (ఆంధ్రజ్యోతి): చెన్నై సెంట్రల్ నుంచి ఈ నెల 6వ తేదీ ఉదయం 8.10 గంటలకు సంత్రాగచ్చికి బయలుదేరాల్సిన రైలును రద్దు చేసినట్లు దక్షిణరైల్వే ప్రకటించింది. ఒడిశాలో రైల్వే లైనుకు మరమ్మతు చేపట్టనున్న కారణంగా ఈ రైలును రద్దు చేశారు.