Siachen Day: సియాచిన్ డే.. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన ప్రదేశంలో భారత సైన్యం ఘన విజయానికి గుర్తు..

ABN , First Publish Date - 2023-04-13T16:41:22+05:30 IST

ప్రతి సంవత్సరం ఏప్రిల్ 13న భారత సైన్యం సియాచిన్ దినోత్సవాలను నిర్వహిస్తుంది. ఆపరేషన్ మేఘ్‌దూత్లో సైన్యం

Siachen Day: సియాచిన్ డే.. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన ప్రదేశంలో భారత సైన్యం ఘన విజయానికి గుర్తు..
Siachen Glacier

న్యూఢిల్లీ : ప్రతి సంవత్సరం ఏప్రిల్ 13న భారత సైన్యం సియాచిన్ దినోత్సవాలను నిర్వహిస్తుంది. ఆపరేషన్ మేఘ్‌దూత్ (Operation Meghdoot)లో సైన్యం ప్రదర్శించిన ధైర్యసాహసాలను, మాతృభూమి కోసం చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఈ ఉత్సవాలను నిర్వహిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన, అత్యంత శీతల ప్రదేశంలో ఈ ఆపరేషన్ జరిగింది.

ఆపరేషన్ మేఘ్‌దూత్

భారత సైన్యానికి చెందిన హై ఆల్టిట్యూడ్ వార్‌ఫేర్ స్కూల్‌కు చెందిన కల్నల్ నరేంద్ర కుమార్ ప్రముఖ పర్వతారోహకుడు, కమాండెంట్. ఆయన 1977లో ఓ జర్మన్ రాఫ్టర్ దగ్గర ఓ మ్యాపును చూశారు. కారకోరమ్ పాస్‌ను ఎన్‌జే 9842కు కలుపుతూ ఓ చుక్కల గీత ఈ మ్యాపులో కనిపించింది. భారత్-పాకిస్థాన్ సరిహద్దు రేఖ ఎన్‌జే 9842 వద్ద ఉన్నట్లు ఇది చెప్తోంది. 1949లో ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వంతో అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఈ పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన 1977 నుంచి రెండు ఎక్స్‌పెడిషన్స్ నిర్వహించారు. ఈ భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని గ్రహించారు.

అప్పటికే పాకిస్థాన్ ఈ భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు చర్యలు ప్రారంభించింది. సాధారణ పౌరులు ఈ ప్రాంతంలో పర్వతారోహణ చేసేందుకు అనుమతి ఇచ్చింది. అదే సమయంలో సైనికపరంగా నియంత్రణ సాధించేందుకు ముందడుగు వేసింది. ఈ నేపథ్యంలో 1984 ఏప్రిల్ 13న ఆపరేషన్ మేఘ్‌దూత్‌ను భారత్ ప్రారంభించింది. దీనికి అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ (Indira Gandhi) అనుమతించారు. భారత సైన్యం అత్యంత సాహసోపేతంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో సాల్టారా రిడ్జ్, సియా లా, బిలాఫాండ్ లా వంటి ప్రధాన కనుమలపై ఆధిపత్యం సాధించింది.

2003లో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం (Dr APJ Abdul Kalam) ఆపరేషన్ మేఘ్‌దూత్‌లో మోహరించిన దళాలను సందర్శించారు. ఈ విధంగా సైనికులను కలిసిన తొలి భారత రాష్ట్రపతిగా, రక్షణ దళాల సుప్రీం కమాండర్‌గా ఆయన రికార్డు సృష్టించారు.

ప్రపంచంలో అత్యంత ఎత్తయిన యుద్ధ క్షేత్రం సియాచిన్ గ్లేసియర్. 1984 నుంచి భారత్-పాక్ ఇక్కడ పోరాడుతున్నాయి. సముద్ర మట్టానికి 6 వేల మీటర్ల ఎత్తులో ఇరు దేశాలు శాశ్వతంగా సైన్యాన్ని ఇక్కడ మోహరిస్తున్నాయి. ఆవాస యోగ్యం కాని ఈ ప్రాంతంలో 2,000 మందికిపైగా సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

ఇవి కూడా చదవండి :

NCERT textbook: మౌలానా అబుల్ కలాం ఆజాద్ పాఠ్యాంశం తొలగింపు

Congress : రాహుల్ గాంధీ అపీలుపై విచారణ

Updated Date - 2023-04-13T16:41:22+05:30 IST