Congress : రాహుల్ గాంధీ అపీలుపై విచారణ

ABN , First Publish Date - 2023-04-13T15:25:24+05:30 IST

మోదీ ఇంటి పేరు కేసులో తీర్పును నిలిపేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన

Congress : రాహుల్ గాంధీ అపీలుపై విచారణ
Rahul Gandhi

సూరత్ : మోదీ ఇంటి పేరు కేసులో తీర్పును నిలిపేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi) దాఖలు చేసిన అపీలుపై గుజరాత్‌లోని సూరత్ సెషన్స్ కోర్టు గురువారం విచారణ జరిపింది. ఆయన తరపున సీనియర్ అడ్వకేట్ ఆర్ఎస్ చీమా వాదనలు వినిపించారు. గాంధీని కేరళలోని వయనాద్ ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించారని, ఆయనపై అనర్హత వేటు వేయడం వల్ల ఆ స్థానం ఖాళీగా ఉందని, ఫలితంగా ప్రజలకు తీరని నష్టం జరుగుతోందని తెలిపారు.

కేవలం బాధితులు మాత్రమే ఫిర్యాదు దాఖలు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రసంగాన్ని సందర్భానికి వ్యతిరేకంగా తీసుకున్నపుడు మినహా, అది పరువు నష్టం కలిగించేది కాదని చెప్పారు. పరువు నష్టం కలిగించేదని చెప్పడానికి దానిని భూతద్దంలో పెట్టి చూస్తేనే పరువు నష్టం కలిగించేది అవుతుందన్నారు. ప్రధాన మంత్రిని తీవ్రంగా విమర్శించినందుకే గాంధీపై ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని చెప్పారు. పరువు నష్టం కేసులో విచారణ అన్యాయంగా జరిగిందని, కఠినంగా ఉందని ఆరోపించారు.

పరువు నష్టం కేసును పూర్ణేశ్ మోదీ దాఖలు చేశారని చెప్తూ, రాహుల్ గాంధీ కర్ణాటకలోని కోలార్‌లో ప్రసంగించారని, దాని గురించి పూర్ణేశ్ మోదీకి వాట్సాప్‌‌లో సందేశం వెళ్లిందని తెలిపారు. పంజాబీలు జగడాలమారులని, తరచూ దూషిస్తూ ఉంటారని ఎవరైనా అంటే, నేను పరువు నష్టం కేసు దాఖలు చేయవచ్చునా? అని ప్రశ్నించారు. ఇలాంటి మాటలు గుజరాతీలను, వివిధ భాషలవారిని, మతపరమైన వ్యవస్థలను ఉద్దేశించి తరచూ అంటూ ఉంటారన్నారు.

ఈ పరువు నష్టం కేసుపై విచారణ జరిపిన కోర్టు తీర్పు చెప్పిన రోజు ఉదయం 11.51 గంటలకు రాహుల్ గాంధీ దోషి అని తెలిపిందని, ఓ అరగంటలోనే ఆయనకు కఠినమైన, గరిష్ఠమైన శిక్షను విధించిందని చెప్పారు. గాంధీని ఉద్దేశించి జడ్జి మాట్లాడుతూ, ‘‘మీకు సుప్రీంకోర్టు హెచ్చరిక జారీ చేసింది. మీరు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. మీరు కొంచెం కూడా అర్థం చేసుకోవడం లేదు’’ అని అన్నారని, ఇది చాలా దిగ్భ్రాంతికరమని చెప్పారు. ‘‘ఐయామ్ సారీ, నేను కఠిన పదాలను వాడుతున్నాను. జడ్జిని తప్పుదోవ పట్టించారు, ఆయన కఠినంగా ఉన్నారు’’ అని చీమా చెప్పారు.

‘‘చౌకీదార్ చోర్ హై’’ అని వ్యాఖ్యానించినందుకు రాహుల్ గాంధీ 2019 నవంబరులో సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పారని, మోదీ ఇంటి పేరు గురించి ఆయన 2019 ఏప్రిల్‌లో మాట్లాడారని తెలిపారు. సుప్రీంకోర్టు రాహుల్ గాంధీని మందలించిందని ఫిర్యాదుదారు చెప్పిన ప్రొసీడింగ్స్‌పై జడ్జి ఎలా ఆధారపడతారని ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి :

NCERT textbook: మౌలానా అబుల్ కలాం ఆజాద్ పాఠ్యాంశం తొలగింపు

బీజేపీకి షాక్.. కాంగ్రెస్‏లో చేరిన సీనియర్ నేత

Updated Date - 2023-04-13T15:25:24+05:30 IST