TamilNadu:తంజావూర్ జిల్లాలో నేడు భారీవర్షాలు...విద్యాసంస్థలకు సెలవు

ABN , First Publish Date - 2023-02-04T10:00:52+05:30 IST

తమిళనాడు రాష్ట్రంలోని తంజావూర్ జిల్లాలో శనివారం కురుస్తున్న భారీవర్షాలతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు...

TamilNadu:తంజావూర్ జిల్లాలో నేడు భారీవర్షాలు...విద్యాసంస్థలకు సెలవు
heavy rainfall

తంజావూర్(తమిళనాడు): తమిళనాడు రాష్ట్రంలోని తంజావూర్ జిల్లాలో శనివారం కురుస్తున్న భారీవర్షాలతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. తంజావూర్, నాగపట్టణం, తిరువారూర్ జిల్లాల్లో శనివారం కురుస్తున్న భారీవర్షాలతో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. చలిగాలులతోపాటు భారీవర్షాల వల్ల తమిళనాడులోని పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. భారీవర్షాల వల్ల విద్యార్థులకు సెలవు ప్రకటిస్తున్నట్లు తంజావూర్ జిల్లా కలెక్టర్ ట్వీట్ చేశారు. అకాల వర్షాలతో జనం సతమతమవుతున్నారు.

Updated Date - 2023-02-04T10:00:54+05:30 IST