Indian Currency: రూ.2 వేల నోట్లు ఇంకా మార్చుకోలేదా.. మిగిలింది 5 రోజులే.. ఆలస్యం చేస్తే అంతే..

ABN , First Publish Date - 2023-09-25T12:47:05+05:30 IST

ఆర్బీఐ(RBI) గైడ్ లైన్స్ ప్రకారం.. ఈ నెల 30 దాటితే రూ.2 వేల నోటు భారత్ లో చెల్లదు. ఆ నోట్లను బ్యాంకుల్లో(Banks) డిపాజిట్ చేయాలని ఆర్బీఐ గతంలోనే గడువు విధించింది. ఈ గడువు సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. ఇంకా మీలో ఎవరి దగ్గరైనా రూ.2 వేల నోటు ఉంటే వెంటనే బ్యాంకుకు వెళ్లండి.

Indian Currency:  రూ.2 వేల నోట్లు ఇంకా మార్చుకోలేదా.. మిగిలింది 5 రోజులే.. ఆలస్యం చేస్తే అంతే..

ఢిల్లీ: ఆర్బీఐ(RBI) గైడ్ లైన్స్ ప్రకారం.. ఈ నెల 30 దాటితే రూ.2 వేల నోటు భారత్‌లో చెల్లుబాటు కాదు. ఆ నోట్లను బ్యాంకుల్లో(Banks) డిపాజిట్ చేయాలని ఆర్బీఐ గతంలోనే గడువు విధించింది. ఈ గడువు సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. ఇంకా ఎవరి దగ్గరైనా రూ.2 వేల నోటు ఉంటే వెంటనే బ్యాంకుకు వెళ్లి మార్చుకోవడం ఉత్తమం. నిజానికి ఈ నోటు మార్పడి ప్రక్రియ మే 23న ప్రారంభమైందన్న విషయం తెలిసిందే.

డిపాజిట్ ఇలా..

ఎలాంటి నిర్దిష్ట పరిమితి లేకుండా వ్యక్తులు తమ బ్యాంకులో రూ.2 వేల నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చని ఆర్బీఐ (RBI) పేర్కొంది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) లేదా జన్ ధన్ ఖాతా(Jandan Account) ఉపయోగిస్తున్న వారికి, సాధారణ డిపాజిట్ పరిమితులు అమలులో ఉంటాయి.


ఖాతాలలో నిర్దిష్ట మొత్తానికి మించి నోట్లను డిపాజిట్ చేయాలనుకుంటే... కొన్ని పరిమితులకు కట్టుబడి ఉండాలి. ఇన్ కం ట్యాక్స్ నిబంధనల ప్రకారం.. వ్యక్తులు బ్యాంకు లేదా పోస్టాఫీసులో ఒకే రోజులో రూ.50 వేల కంటే ఎక్కువ నగదు డిపాజిట్(Deposite) చేసినప్పుడు వారి పాన్ కార్డు నంబర్‌ని (PAN) తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది.

ఆ రోజు సెలవు(Bank Holidays)..

సోమవారం నుంచి కేవలం 5 రోజుల వరకే నోట్లు మార్చుకునే ఛాన్స్ ఉంది. సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు బ్యాంకులు తెరిచి ఉంటాయి. 28వ తేదీన మిలాద్-ఉన్-నబీ పండగ ఉండటంతో బ్యాంకులకు ఆ రోజు సెలవు. మిగిలిన 29, 30 తేదీల్లో మాత్రమే బ్యాంకులు తెరిచి ఉంటాయని గమనించగలరు.

Updated Date - 2023-09-25T12:55:35+05:30 IST