Share News

Parliament security breach: ఒకేరోజు 78, మొత్తంగా 92 మంది ఎంపీలపై సస్పెన్షన్

ABN , Publish Date - Dec 18 , 2023 | 07:52 PM

పార్లమెంటు భద్రతా ఉల్లంఘన అంశంపై ఉభయసభల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. విపక్షాల నిరసనలతో ఉభయ సభల కార్యకలాపాలు నిలిచిపోవడంతో సోమవారంనాడు 78 ఎంపీలపై సస్పెన్షన్ల వేటు పడింది. దీంతో ఇప్పటివరకూ ఉభయసభల్లో సస్పెన్షన్ వేటు పడిన ఎంపీల సంఖ్య 92కు చేరింది.

Parliament security breach: ఒకేరోజు 78, మొత్తంగా 92 మంది ఎంపీలపై సస్పెన్షన్

న్యూఢిల్లీ: పార్లమెంటు భద్రతా ఉల్లంఘన (Parliament security breach) అంశంపై ఉభయసభల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. విపక్షాల నిరసనలతో ఉభయ సభల కార్యకలాపాలు నిలిచిపోవడంతో సోమవారంనాడు 78 ఎంపీలపై సస్పెన్షన్ల వేటు పడింది. దీంతో ఇప్పటివరకూ ఉభయసభల్లో సస్పెన్షన్ వేటు పడిన ఎంపీల సంఖ్య 92కు చేరింది.


సభాకార్యక్రమాలకు అంతరాయ కలిగించిన 45 మంది ఎంపీలను స్పీకర్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ సోమవారంనాడు సస్పెండ్ చేశారు. దీనికి ముందు లోక్‌సభలో 33 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. వీరిలో 30 మందిని శీతాకాల సమావేశాలు ముగిసేంతవరకూ సస్పెండ్ చేస్తున్నట్టు లోక్‌సభ స్పీకర్ ప్రకటించారు. ముగ్గురుని ప్రివిలెజ్ కమిటీ నివేదక వచ్చే వరకూ సస్పెండ్ చేస్తు్న్నట్టు తెలిపారు. కాగా, ఉభయ సభలో విపక్షాల ఆందోళన కారణంగా ఇంతకుముందే లోక్‌సభ నుంచి 13 మంది ఎంపీలను, రాజ్యసభ నుంచి ఒక ఎంపీని శీతాకాల సమావేశాలు ముగిసేంత వరకూ సస్పెండ్ చేశారు.


రాజ్యసభ నుంచి సస్పెండైన కాంగ్రెస్ ఎంపీలలో జైరామ్ రమేష్, రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, కేసీ వేణుగోపాల్ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి 18 మంది, టీఎంసీ నుంచి 7, డీఎంకే నుంచి 5, సీపీఎం నుంచి 3, ఆర్జేడీ, జేడీయూ, ఎస్‌పీ, సీపీఐ నుంచి ఇద్దరేసి చొప్పున, జేఎంఎం, కేసీఎం, ఏజీఎం, ఎన్‌సీపీ నుంచి ఒక్కొక్కరు చొప్పున సస్పెండ్ అయ్యారు. ఎంపీలను పెద్ద సంఖ్యలో సస్పెండ్ చేయడాన్ని విపక్షాలు తప్పుపట్టగా, సస్పెన్షన్ చర్యను రాజ్యసభలో సభానేత పీయూష్ గోయెల్ సమర్ధించారు. విపక్షాలు సజావుగా సభలు సాగాలని కోరుకోవడం లేదని, ముందస్తు వ్యూహంతోనే విపక్షాలు సభకు వచ్చారని ఆయన తెలిపారు.

Updated Date - Dec 18 , 2023 | 07:52 PM