Share News

ShriRamBhajan: ‘శ్రీరామభజన్’ హ్యాష్‌ట్యాగ్‌ ఉపయోగించి..రామమందిరంపై క్రియేషన్స్ చేయాలన్న ప్రధాని

ABN , Publish Date - Dec 31 , 2023 | 03:13 PM

జనవరిలో జరగనున్న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం గురించి అనేక మంది ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో జనవరి 22న 'శ్రీరామభజన్' అనే హ్యాష్‌ట్యాగ్‌ని ఉపయోగించి అనేక మంది సోషల్ మీడియాలో తమ క్రియేషన్‌లను షేర్ చేయాలని ప్రధాని మోదీ సూచించారు.

ShriRamBhajan: ‘శ్రీరామభజన్’ హ్యాష్‌ట్యాగ్‌ ఉపయోగించి..రామమందిరంపై క్రియేషన్స్ చేయాలన్న ప్రధాని

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరం(Ram Mandir) జనవరి 22న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజలతోపాటు విదేశాల్లో కూడా అనేక మంది ఈరోజు కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నేడు(డిసెంబర్ 31) మన్ కీ బాత్ 108వ ఎపిసోడ్‌లో పాల్గొన్న ప్రధాని(narendra modi) ప్రజలకు కీలక సూచనలు చేశారు. అయోధ్యలోని రామ మందిరం ప్రారంభం రోజున అంటే జనవరి 22న దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ ఆలయం గురించి వారి క్రియోషన్లను #ShriRamBhajan అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పంచుకోవాలని సూచించారు. ఈ క్రమంలో శ్రీరాముడు లేదా అయోధ్య గురించి భజనలు, పాటలు లేదా తమ భావాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయాలని కోరారు. ఈ సందర్భంగా అనేక మంది కొత్త పద్యాలు కూడా రాస్తున్నారని గుర్తు చేశారు.


ఈ చారిత్రక ఘట్టంలో పలువురు తమదైన విశిష్టమైన రీతిలో ఇప్పటికే భాగస్వామ్యులవుతున్నారని అన్నారు. మనమందరం అలాంటి క్రియేషన్‌లన్నింటినీ ఒకేరోజు ఉమ్మడి హ్యాష్‌ట్యాగ్‌తో పంచుకుంటే భావోద్వేగాలు, భక్తి ప్రవాహాంతో సోషల్ మీడియా(Social media) మార్మోగిపోతుందని చెప్పారు. దీంతోపాటు ప్రతి ఒక్కరూ రాముడి తత్వాన్ని నింపుకోవచ్చని గుర్తు చేశారు. అంతేకాదు ఇప్పటికే అనేక మందికి అయోధ్యకు వచ్చేందుకు కుదరకపోతే ఇంట్లోనే దీపాలు వెలిగించి పూజలు చేయాలని కూడా ప్రధాని సూచించారు.

Updated Date - Dec 31 , 2023 | 03:13 PM