Vande Bharat Express: భోపాల్-న్యూఢిల్లీ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు మోదీ పచ్చజెండా

ABN , First Publish Date - 2023-04-01T09:44:47+05:30 IST

భోపాల్- న్యూఢిల్లీ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం పచ్చజెండా...

Vande Bharat Express: భోపాల్-న్యూఢిల్లీ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు మోదీ పచ్చజెండా
Modi To Flag Off Vande Bharat Express

భోపాల్ (మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్- న్యూఢిల్లీ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం పచ్చజెండా ఊపారు. (Modi To Flag Off Vande Bharat Express)శనివారం ప్రధాని మోదీ కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో పర్యటిస్తున్నారు.తన పర్యటన సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ నుంచి భోపాల్-న్యూఢిల్లీ మార్గంలో(Bhopal-New Delhi) దేశంలోని 11వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభించారు.

ఇది కూడా చదవండి : Big Relief For LPG Customers: వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులకు శుభవార్త...నేటి నుంచి సిలిండర్ ధర రూ.92 తగ్గింపు

ఈ రైలుతో రెండు ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గిస్తోంది.ప్రయాణికులు భోపాల్ నుంచి న్యూఢిల్లీ సెమీ హై స్పీడ్ రైలులో 7 గంటల 45 నిమిషాల్లో చేరనున్నారు. ‘‘భోపాల్- న్యూఢిల్లీ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ ఫ్లాగ్ ఆఫ్ తో మధ్యప్రదేశ్- ఢిల్లీ మధ్య కనెక్టివిటీని పెంచుతుంది’’ అని ప్రధాని మోదీ శనివారం ట్వీట్ చేశారు.దేశంలోనే తయారు చేసిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సెట్‌లో అత్యాధునిక ప్రయాణీకుల సౌకర్యాలు ఉన్నాయి. ఇది రైలు వినియోగదారులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. ఈ రైలు కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోని చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేశారు. భారతదేశంలో రెండవ అత్యంత వేగవంతమైన రైలు సెమీ-హై-స్పీడ్ రైలుగా నిలిచింది.

ఇది కూడా చదవండి : Pic Goes Viral : ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో ధోనికి అరిజిత్ సింగ్ పాదాభివందనం

ప్రస్తుతం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ముంబై సెంట్రల్ - అహ్మదాబాద్ - గాంధీనగర్ క్యాపిటల్‌తో సహా భారతదేశంలోని 10 మార్గాల్లో నడుస్తోంది. ముంబై - సాయినగర్ షిర్డీ, ముంబై - షోలాపూర్, న్యూఢిల్లీ-వారణాసి, న్యూఢిల్లీ - శ్రీ వైష్ణో దేవి మాత కత్రా, అంబ్ అందౌరా - న్యూఢిల్లీ, మైసూరు - పురట్చి తలైవర్ డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్, నాగ్పూర్ - బిలాస్ పూర్, హౌరా - న్యూ జల్పాయిగురి, సికింద్రాబాద్ - విశాఖపట్నంల మధ్య వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి.

Updated Date - 2023-04-01T09:46:38+05:30 IST