PM Modi: ప్రధాని మోదీ ఆకస్మిక తనిఖీ.. ఏకంగా గంటకుపైగా..

ABN , First Publish Date - 2023-03-30T22:04:50+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra modi) నూతన పార్లమెంట్ బిల్డింగ్ ‘సెంట్రల్ విస్తా’ (Central Vista) నిర్మాణ పనులను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

PM Modi: ప్రధాని మోదీ ఆకస్మిక తనిఖీ.. ఏకంగా గంటకుపైగా..

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra modi) నూతన పార్లమెంట్ బిల్డింగ్ ‘సెంట్రల్ విస్తా’ (Central Vista) నిర్మాణ పనులను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తుది దశలో ఉన్న నిర్మాణ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనులు జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలించారు. ప్రధాని మోదీ సర్‌ప్రైజ్ విజిట్‌తో అధికారులు ఆశ్చర్యపోయారు. నిర్మాణానికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. ప్రధాని మోదీ గంటకుపైగా సెంట్రల్ విస్తా ప్రాంతంలో గడిపారని, పలు పనులను తనిఖీ చేశారని ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. ఇక ప్రధాని వెంట లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఉన్నారు. ప్రధాని విజిట్‌కు సంబంధించిన ఫొటోల్లో పెద్ద హాల్స్, ఒక లైబ్రరీ, భారీ పార్కింగ్ ప్రదేశం, కమిటీ రూమ్స్ కనిపించాయి. ప్రాంతమంతా కలియదిగిరి ప్రధాని మోదీ నిర్మాణ కార్మికులతో కూడా ముచ్చటించినట్టు ఫొటోల్లో స్పష్టమవుతోంది.

Untitled-10.jpg

కాగా గతేడాది నవంబర్‌లో కొత్త పార్లమెంట్ భవనం అందుబాటులోకి వస్తుందని అంచనా వేసినా సాధ్యపడలేదు. ప్రస్తుతం పనులు ముగింపు దశకు చేరుకోవడంతో త్వరలోనే ‘సెంట్రల్ విస్తా’ను ప్రారంభించే అవకాశాలున్నాయి. భారత ప్రజాస్వామ్య వారసత్వం ఉట్టిపడేలా ఎంపీల కోసం ఒక లాంజ్, ఒక లైబ్రరీ, వేర్వేరు కమిటీ రూమ్స్, డైనింగ్ ఏరియా, విశాలమైన పార్కింగ్‌తో దీనిని నిర్మించారు. అంతేకాకుండా ప్రధానమంత్రి కార్యాలయం (PMO), క్యాబినెట్ సెక్రటేరియెట్, ఇండియా హౌస్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియెట్ కూడా ఇక్కడే కొలువదీరనున్నాయి. కాగా ఈ కొత్త పార్లమెంట్ సముదాయ నిర్మాణానికి డిసెంబర్ 2020లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్మాణ పనులను టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నిర్మిస్తోంది.

Updated Date - 2023-03-30T22:06:24+05:30 IST