Vande Bharat train:కేరళ మొదటి వందేభారత్ రైలుకు మోదీ పచ్చజెండా

ABN , First Publish Date - 2023-04-25T12:44:29+05:30 IST

కేరళ రాష్ట్రంలో మొట్టమొదటి వందేభారత్ రైలుకు మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు....

Vande Bharat train:కేరళ మొదటి వందేభారత్ రైలుకు మోదీ పచ్చజెండా
PM Modi flags off Vande Bharat train

తిరువనంతపురం (కేరళ): కేరళ రాష్ట్రంలో మొట్టమొదటి వందేభారత్ రైలుకు మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు.(Vande Bharat train)ఈ రైలు కేరళలోని తిరువనంతపురం, కొల్లం, కొట్టాయం, ఎర్నాకుళం, త్రిస్సూర్, పాలక్కాడ్, పతాన్మిట్ట, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసర్ గడ్ జిల్లాల మీదుగా నడుస్తుందని ప్రధాని కార్యాలయం తెలిపింది. రైలు ప్రారంభించే ముందు ప్రధాని మోదీ( Prime Minister Narendra Modi) వందేభారత్ రైలులోని పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు. కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, సీఎం పినరయి విజయన్, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ లతో కలిసి ప్రధాని ఈ రైలును ప్రారంభించారు.

ఇది కూడా చదవండి : WTC Final: ఐపీఎల్‌లో అదరగొట్టిన రహానేకు డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో చోటు..

తిరువనంతపురం వచ్చిన ప్రధాని మోదీకి బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి రైల్వేస్టేషన్ వరకు రోడ్డు మార్గంలో ప్రయాణించిన మోదీకి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొచ్చి వాటర్ మెట్రో సర్వీసును ప్రధాని ప్రారంభించారు. దిండిగుల్ పలానీ- పాలక్కాడ్ సెక్షన్ విద్యుదీకరణ పనులు, ఫస్ట్ డిజిటల్ సైన్స్ పార్కులను ప్రధాని మోదీ ప్రారంభించారు.

Updated Date - 2023-04-25T13:21:14+05:30 IST