Delhi University : ‘సారే జహా సే అచ్ఛా’ రచయిత ఇక్బాల్‌పై పాఠం సిలబస్ నుంచి తొలగింపు

ABN , First Publish Date - 2023-05-27T15:35:30+05:30 IST

‘సారే జహా సే అచ్ఛా’ గీత రచయిత మహమ్మద్ అల్లమ ఇక్బాల్‌పై పాఠాన్ని సిలబస్ నుంచి తొలగించాలని ఢిల్లీ విశ్వవిద్యాలయం నిర్ణయించింది. బీఏ ఆరో సెమిస్టర్‌లో ‘మోడర్న్

Delhi University : ‘సారే జహా సే అచ్ఛా’ రచయిత ఇక్బాల్‌పై పాఠం సిలబస్ నుంచి తొలగింపు
Delhi University

న్యూఢిల్లీ : ‘సారే జహా సే అచ్ఛా’ గీత రచయిత మహమ్మద్ అల్లమ ఇక్బాల్‌పై పాఠాన్ని సిలబస్ నుంచి తొలగించాలని ఢిల్లీ విశ్వవిద్యాలయం (Delhi University) నిర్ణయించింది. బీఏ ఆరో సెమిస్టర్‌లో ‘మోడర్న్ ఇండియన్ పొలిటికల్ థాట్’ అధ్యాయాన్ని తొలగించాలని ఈ విశ్వవిద్యాలయం అకడమిక్ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించింది. 1877లో పుట్టిన ఇక్బాల్ పాకిస్థాన్ ప్రత్యేక దేశ ఏర్పాటుకు కారకుల్లో ఒకరు.

ఇక్బాల్ అవిభాజ్య భారత దేశంలో 1877లో జన్మించారు. ఆయన దేశ విభజనకు కారకుడైనందువల్ల ఆయన గురించి బోధిస్తున్న పాఠాన్ని తొలగించాలని ఢిల్లీ విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఈ విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ యోగేశ్ సింగ్ మాట్లాడుతూ, భారత దేశ విభజనకు పునాది వేసినవారి గురించి సిలబస్‌లో ఉండకూడదన్నారు. 1,014వ అకడమిక్ కౌన్సిల్ సమావేశంలో చర్చించి, ఇక్బాల్‌పై అధ్యాయాన్ని తొలగించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

అకడమిక్ కౌన్సిల్ మెంబర్ ఒకరు ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఢిల్లీ విశ్వవిద్యాలయం ఉప కులపతి చేసిన ప్రతిపాదనను అకడమిక్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలిపారు. అండర్‌గ్రాడ్యుయేట్ కరికులం ఫ్రేమ్‌వర్క్, 2022 క్రింద వివిధ కోర్సుల్లో 4వ, 5వ, 6వ సెమిస్టర్ల సిలబస్ కోసం ఈ సమావేశంలో తీర్మానం చేసినట్లు తెలిపారు. డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్, తదితరుల గురించి బోధించాలని వీసీ నొక్కివక్కాణించారని తెలిపారు. పొలిటికల్ సైన్స్ సిలబస్ నుంచి ఇక్బాల్‌పై పాఠాన్ని తొలగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. స్టాండింగ్ కమిటీ సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

దేశ విభజన, హిందుత్వం, గిరిజనులపై అధ్యయనాలకు ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను కూడా ఆమోదించినట్లు తెలిపారు. దేశ విభజనపై అధ్యయనానికి ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ఐదుగురు కౌన్సిల్ సభ్యులు వ్యతిరేకించినట్లు తెలిపారు. ఇది విభజనవాదమని వారు ఆరోపించారని చెప్పారు.

ఏబీవీపీ హర్షం

ఇక్బాల్‌పై పాఠాన్ని సిలబస్ నుంచి తొలగించాలని నిర్ణయించినందుకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) హర్షం ప్రకటించింది. ఫేనటిక్ థియొలాజికల్ స్కాలర్ ఇక్బాల్ దేశ విభజనకు బాధ్యుడని మండిపడింది. పాకిస్థాన్ ఫిలాసఫికల్ ఫాదర్ అని ఇక్బాల్‌ను పిలుస్తారని గుర్తు చేసింది. జిన్నాను ముస్లిం లీగ్‌ నాయకుడిగా స్థిరపరచడంతో ఇక్బాల్ కీలక పాత్ర పోషించారని తెలిపింది.

ఎన్‌సీఈఆర్‌టీ కూడా..

జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (NCERT) ఏప్రిల్‌లో సిలబస్‌ను సవరించింది. మొఘలు సామ్రాజ్యానికి, డార్విన్ సిద్ధాంతానికి సంబంధించిన పాఠ్యాంశాలను తొలగించింది.

ఇవి కూడా చదవండి :

Amit Shah: నేను చాలా అదృష్టవంతుడిని: అమిత్‌షా

Ghaziabad: ఫుడ్ ప్యాకెట్‌లో ఉమ్మి వేసిన రెస్టారెంట్ ఉద్యోగి

Updated Date - 2023-05-27T15:35:30+05:30 IST