Amit Shah: నేను చాలా అదృష్టవంతుడిని: అమిత్‌షా

ABN , First Publish Date - 2023-05-27T14:47:27+05:30 IST

కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ తరుణంలో తనను తాను అదృష్టవంతుడుగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అభివర్ణించుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పాత, కొత్త పార్లమెంటులకు తాను ప్రజాప్రతినిధిగా ఉండటం తన అదృష్టమని శనివారంనాడు ట్వీట్ చేశారు.

Amit Shah: నేను చాలా అదృష్టవంతుడిని: అమిత్‌షా

న్యూఢిల్లీ: కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ తరుణంలో తనను తాను అదృష్టవంతుడుగా (fortunate) కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) అభివర్ణించుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పాత, కొత్త పార్లమెంటులకు తాను ప్రజాప్రతినిధిగా ఉండటం తన అదృష్టమని శనివారంనాడు ట్వీట్ చేశారు.

''కొత్త పార్లమెంంటు భవనం వింత శోయగాలతో ముస్తాబుకావడంతో యావద్దేశం చాలా సంతోషంగా ఉంది. మన దేశ సంస్కృతి, ఆధునికత్వానికి ఇదొక గొప్ప ఉదాహరణ. పాత పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తుండటం, ఇప్పుడు ఇదే హోదాలో కొత్త పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించనుండటం, రెండుసార్లూ ప్రధాన మోదీ నాయకత్వంలో పనిచేయడం నా అదృష్టం'' అని అమిత్‌షా ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. తన ట్వీట్‌కు ఎన్నో ప్రత్యేకతలతో కూడిన పార్లమెంటు భవనం వీడియోను ఆయన షేర్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు సార్లు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి గెలుపొంది ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తుండగా, అమిత్‌షా తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌‌లోని గాంధీనగర్‌ నియోజకవర్గం నుంచి గెలుపొంది లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తు్న్నారు. ఈనెల 28న పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.

Updated Date - 2023-05-27T14:50:50+05:30 IST