Coromandel Express Accident Live Updates: కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద ఘటన తాజా అప్‌డేట్స్..

ABN , First Publish Date - 2023-06-02T22:54:24+05:30 IST

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఒడిశాలోని బాలాసోర్ ప్రాంతంలోని బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు అక్కడే ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది.

Coromandel Express Accident Live Updates:  కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద ఘటన తాజా అప్‌డేట్స్..

* చెన్నై రైల్వే స్టేషన్‌లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు

* ప్రమాదానికి గురైన ట్రైన్ 12841 షాలిమర్ - చెన్నై కోరమండల్ ఎక్స్‌ప్రెస్ కావడంతో చెన్నై రైల్వే స్టేషన్‌లో హెల్ప్ డెస్క్

TRAIN1.jpg

ఒడిశాలో రైలు ప్రమాదం కారణంగా రద్దయిన, దారి మళ్లించిన రైళ్ల వివరాలు:

2e1742ef-fc62-4572-88ad-b1c37abc8fa8.jpg

* రైలు ప్రమాద బాధితుల కోసం కొనసాగుతున్న సహాయక చర్యలు

* ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 10 లక్షల పరిహారం ప్రకటించిన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్

* గాయపడిన వారికి 2 లక్షల ఆర్థిక సాయం ప్రకటన

train.jpg

* ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ

* రైల్వే శాఖ మంత్రి అశ్వినివైష్ణవ్‌తో మాట్లాడిన ప్రధాని మోదీ

* రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రధాని మోదీ

కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం:

హెల్ప్‌లైన్ నంబర్లు:

* హౌరా హెల్ప్‌లైన్ నంబర్: 033-26382217

* ఖరగ్‌పూర్ హెల్ప్‌లైన్ నంబర్: 8972073925 & 9332392339

* బాలాసోర్ హెల్ప్‌లైన్ నంబర్: 8249591559 & 7978418322

* షాలిమర్ హెల్ప్‌లైన్ నంబర్: 9903370746

Fxoa43_2023_06_02_102350.jpg

కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద దృశ్యాలు

FxoHmPCacAA8oIY.jpgFxoHj56aYAEpKAM.jpgFxoHhaCaMAEJV0x.jpgFxoHin3acAUtlvg.jpg


ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఒడిశాలోని బాలాసోర్ ప్రాంతంలోని బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు అక్కడే ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. శుక్రవారం సాయంత్రం 6:50 నిమిషాలకు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘోర రైలు ప్రమాదంలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఎనిమిది బోగీలు పల్టీలు కొట్టి బోల్తా పడ్డాయి. దీంతో ప్రయాణీకుల్లో కొందరు చెల్లాచెదురుగా రైలు బయట పడి ఉండగా, కొందరు బోగీల్లో చిక్కుకుపోయి ఆర్తనాదాలు చేశారు. దాదాపు 50 మందికి పైగా ఈ ఘటనలో ఇప్పటికి ప్రాణాలు కోల్పోయారు. 350 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 50 అంబులెన్స్‌ల్లో సమీప ఆసుపత్రులకు తరలించే పనిలో సహాయక బృందాలు నిమగ్నమయ్యాయి.

Updated Date - 2023-06-02T23:18:11+05:30 IST