Indian Economy : భారత ఆర్థిక వ్యవస్థ మందగమనం తాత్కాలికమే : మూడీస్ అనలటిక్స్

ABN , First Publish Date - 2023-03-07T19:59:53+05:30 IST

భారత దేశ ఆర్థిక వ్యవస్థ (Indian Economy)లో ఇటీవలి సంవత్సరాల్లో కనిపించిన మందగమనం తాత్కాలికమేనని మూడీస్ అనలటిక్స్

Indian Economy : భారత ఆర్థిక వ్యవస్థ మందగమనం తాత్కాలికమే : మూడీస్ అనలటిక్స్
Moody's Analytics

న్యూఢిల్లీ : భారత దేశ ఆర్థిక వ్యవస్థ (Indian Economy)లో ఇటీవలి సంవత్సరాల్లో కనిపించిన మందగమనం తాత్కాలికమేనని మూడీస్ అనలటిక్స్ (Moody's Analytics) పేర్కొంది. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ప్రధాన చోదక శక్తి వ్యాపారం కన్నా దేశీయ ఆర్థిక వ్యవస్థేనని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం గత వారం విడుదల చేసిన వివరాల ప్రకారం, స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి రేటు 2022 అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో 4.4 శాతం మాత్రమే. దీనికి కారణం తయారీ రంగంలో క్షీణత, ప్రైవేట్ వినియోగ వ్యయం తగ్గిపోవడం అని నిపుణులు చెప్తున్నారు.

ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరంలో అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో తయారీ రంగం 1.1 శాతం మేరకు క్షీణించింది. ప్రైవేట్ వినియోగ వ్యయం 2.1 శాతం మందగించింది.

మూడీస్ అనలటిక్స్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, సంవత్సరం క్రితం ప్రాతిపదికపై పరిశీలించినపుడు వృద్ధి మందగించిందని తెలిపింది. 2021 రెండో త్రైమాసికంలో కోవిడ్-19 డెల్టా వేరియంట్ ప్రభంజనం ఆర్థిక వ్యవస్థ మీద చేసిన దాడి తర్వాత మొట్టమొదటిసారి ప్రైవేట్ వినియోగ వ్యయం ఓవరాల్ జీడీపీని వెనుకకు లాగింది. గత ఏడాదికి ముందటి సంవత్సరంలో వృద్ధి మందగమనం తాత్కాలికమేనని ఈ నివేదిక అభిప్రాయపడింది. అమెరికా, యూరోప్ దేశాల్లో వృద్ధి రేటు మెరుగుపడుతుండటం కూడా భారత దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి దోహదపడుతుందని తెలిపింది.

ప్రైవేట్ వినియోగ వ్యయంతో ప్రధాన సంబంధంగల రంగాలు తయారీ రంగం, వ్యవసాయ రంగం అని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో ఈ రంగాల్లో క్షీణత కానీ, స్వల్ప వృద్ధి కానీ కనిపించినట్లు తెలిపింది.

వడ్డీ రేట్లు అధికంగా ఉండటం వల్ల దేశీయ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి వచ్చిందని తెలిపింది. దీనివల్ల దిగుమతులు తగ్గాయని, బాహ్య అసమతుల్యతలు విస్తరించాయని పేర్కొంది. ఫలితంగా రూపాయిపై ఒత్తిడి, ద్రవ్యోల్బణం పెరిగాయని పేర్కొంది.

2022-23 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 7 శాతం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ఇవి కూడా చదవండి :

NIA Vs PFI : బిహార్‌లో పీఎఫ్ఐ కేసు... కేరళ, కర్ణాటకల్లో ఐదుగురి అరెస్ట్...

Holi Celebrations : ఆరెస్సెస్ ఇలా హోళీ జరుపుకోవడం ఇదే తొలిసారి!

Updated Date - 2023-03-07T19:59:53+05:30 IST