Working-Age Populations : ఉపాధి రంగంలో 2030నాటికి భారత్ ఘనత సాధించబోతోంది : మెకిన్సే నివేదిక

ABN , First Publish Date - 2023-08-26T12:25:07+05:30 IST

జనాభాలో పని చేసే సత్తువగల వయసులో ఉన్నవారు అధికంగా ఉండే మూడు దేశాల్లో 2030నాటికి భారత దేశం ఒకటి కాబోతోంది. ప్రపంచంలో ఈ వయస్కులు అత్యధికంగా ఉండే ఐదు ప్రధాన ఆర్థిక వ్యవస్థలుగల దేశాల్లో భారత దేశం, చైనా, ఇండోనేషియా ఉంటాయి.

Working-Age Populations : ఉపాధి రంగంలో 2030నాటికి భారత్ ఘనత సాధించబోతోంది : మెకిన్సే నివేదిక

న్యూఢిల్లీ : జనాభాలో పని చేసే సత్తువగల వయసులో ఉన్నవారు అధికంగా ఉండే మూడు దేశాల్లో 2030నాటికి భారత దేశం ఒకటి కాబోతోంది. ప్రపంచంలో ఈ వయస్కులు అత్యధికంగా ఉండే ఐదు ప్రధాన ఆర్థిక వ్యవస్థలుగల దేశాల్లో భారత దేశం, చైనా, ఇండోనేషియా ఉంటాయి. ఈ మూడు దేశాలు జీ20లో కూడా ఉన్నాయి. దీనిని బట్టి ఎకనమిక్ జాగ్రఫీ తూర్పు దేశాలవైపు మారబోతున్నట్లు అర్థమవుతోంది. ఈ వివరాలను మెకిన్సే తన ‘‘డ్రైవింగ్ సుస్టెయినబుల్ అండ్ ఇంక్లూసివ్ గ్రోత్ ఇన్ జీ20 ఎకానమీస్’’ నివేదికలో వెల్లడించింది.

శనివారం విడుదలైన ఈ నివేదికలో తెలిపిన వివరాల ప్రకారం, డిజిటల్, డేటా ప్రసారం వల్ల కమ్యూనికేషన్, విజ్ఞానం పరస్పర మార్పిడి జరుగుతుంది. అందువల్ల గతం కన్నా మరింత ఎక్కువగా ప్రపంచం ఒకరిపై మరొకరు ఆధారపడే విధంగా రూపొందుతుంది. ప్రపంచం నవ శకం అంచున, మేలి మలుపు అంచున ఉన్నట్లు ప్రపంచ ఆర్థిక పరిస్థితులు సూచిస్తున్నాయి. ఎకనమిక్ జాగ్రఫీ తూర్పువైపునకు మారుతోంది.

భవిష్యత్తులో ఆర్థిక కేంద్రాలు మారే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుతం జీ20 దేశాల్లో సుస్థిరత, సమ్మిళితత్వం విస్తృతమైన, విభిన్నమైన ధోరణులు కనిపిస్తున్నాయి. జీ20 దేశాల్లో ఆర్థిక సాధికారత రేఖకు దిగువన 2.6 బిలియన్ల మంది ఉన్నారు. ప్రపంచంలో 4.7 బిలియన్ల మంది, భారత దేశంలో 1.07 బిలియన్ల మంది ఈ రేఖకు దిగువన ఉన్నారు. అంటే ప్రపంచ జనాభాలో సగానికిపైగా ఆర్థిక సాధికారులు కాదు.


ఆర్థిక వ్యత్యాసాలను తొలగించాలంటే జీ20 దేశాలు అదనంగా 21 ట్రిలియన్ డాలర్లను 2021-2030 దశకంలో ఖర్చు చేయాలి. భారత దేశం ఈ వ్యత్యాసాన్ని తొలగించడం కోసం ఈ దశాబ్దంలో 5.4 ట్రిలియన్ డాలర్లు, అంటే జీడీపీలో 13 శాతం ఖర్చు చేయాలి. చైనా 4.8 ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేయవలసి ఉంటుంది.

ప్రభుత్వ, ప్రైవేటు చర్యల్లో భారత దేశం ప్రత్యేకతను సంతరించుకుంది. ఎనిమిది చర్యలు ప్రజలను అభివృద్ధి చేయడానికి దోహదపడుతున్నాయి. అవి ఏమిటంటే,

- సమ్మిళితత్వం కోసం జన్ ధన్ బ్యాంకు ఖాతాలు, ఆధార్, మొబైల్‌లను ఉపయోగించుకోవడం.

- ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం.

- కోవిన్ పోర్టల్.

- అపోలో హాస్పిటల్స్ అమలు చేస్తున్న ఓమ్ని-చానల్ హెల్త్‌కేర్ సర్వీసులు.

- ప్రభుత్వం అమలు చేస్తున్న చిరు ధాన్యాలపై అవగాహన పథకం.

- సౌర విద్యుత్తు రంగంలో అత్యధిక సామర్థ్యం.

- ఓలా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వృద్ధి.

- ఇండోర్ నగర పాలక సంస్థ అమలు చేస్తున్న వ్యర్థాల నిర్వహణ విధానం.


ఇవి కూడా చదవండి :

Chandrayaan-3 : చంద్రయాన్-3 విజయోత్సవాలు.. ఇస్రో శాస్త్రవేత్తల సమక్షంలో మోదీ భావోద్వేగం..

Smart Cities Awards : ఇండోర్ అత్యుత్తమ స్మార్ట్ సిటీ.. మధ్య ప్రదేశ్ అత్యుత్తమ రాష్ట్రం..

Updated Date - 2023-08-26T12:25:07+05:30 IST