Madhya Pradesh : పన్నెండేళ్ల బాలికపై ఘోరాతి ఘోరం.. ఇద్దరు నిందితుల ఇళ్లు బుల్డోజర్‌తో కూల్చివేత..

ABN , First Publish Date - 2023-07-29T15:25:05+05:30 IST

మానవత్వం మరచిన దుర్మార్గులకు మధ్య ప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం గట్టిగా బుద్ధి చెప్పింది. పన్నెండేళ్ల బాలికపై అత్యంత అమానుషంగా, కిరాతకంగా అత్యాచారం చేసి, ఆమె మర్మాంగాల్లోకి ఇనుప ఊచను దింపిన ఇద్దరు నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేసింది. అంతేకాకుండా వారిని ఉద్యోగాల నుంచి తొలగించింది.

Madhya Pradesh : పన్నెండేళ్ల బాలికపై ఘోరాతి ఘోరం.. ఇద్దరు నిందితుల ఇళ్లు బుల్డోజర్‌తో కూల్చివేత..

భోపాల్ : మానవత్వం మరచిన దుర్మార్గులకు మధ్య ప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం గట్టిగా బుద్ధి చెప్పింది. పన్నెండేళ్ల బాలికపై అత్యంత అమానుషంగా, కిరాతకంగా అత్యాచారం చేసి, ఆమె మర్మాంగాల్లోకి ఇనుప ఊచను దింపిన ఇద్దరు నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేసింది. అంతేకాకుండా వారిని ఉద్యోగాల నుంచి తొలగించింది.

సాత్నా జిల్లా, మైహర్ పట్టణంలో ఓ ప్రముఖ టెంపుల్‌లో తాత్కాలిక ప్రాతిపదికపై పని చేస్తున్న రవీంద్ర చౌదరి, అతుల్ బఢౌలియా ఓ పన్నెండేళ్ల బాలికపై గురువారం కిరాతకంగా అత్యాచారం చేసి, ఆమె మర్మాంగాల్లోకి ఇనుప ఊచను దింపినట్లు పోలీసులు తెలిపారు. అయితే మరొక పోలీసు అధికారి మాట్లాడుతూ, వైద్య పరీక్షల అనంతరం మరింత స్పష్టమైన వివరాలు తెలుస్తాయని చెప్పారు. ఈ వార్త తెలిసిన తర్వాత ఈ ఇద్దరు నిందితులను ఉద్యోగాల నుంచి తొలగించినట్లు టెంపుల్ కమిటీ తెలిపింది.

మధ్య ప్రదేశ్‌లోని విదిశ జిల్లా, ఉదయ్‌పూర్‌లో ఉన్న రవీంద్ర ఇంటిని; మలియాన్ టోల, న్యూ బస్తీలోని అతుల్ ఇంటిని శనివారం బుల్డోజర్లతో అధికారులు కూల్చేశారు. పోలీసుల బందోబస్తు నడుమ నిందితులకు ఈ విధంగా గట్టిగా బుద్ధి చెప్పారు.

బాధిత బాలిక ప్రస్తుతం రేవాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులిద్దరినీ అరెస్టు చేసినట్లు తెలిపారు. స్థానిక కోర్టు వీరికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించిందని చెప్పారు.


ఇవి కూడా చదవండి :

Manipur : మణిపూర్ బయల్దేరిన ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు

Bharat Jodo Yatra : ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టితో మరోసారి రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’

Updated Date - 2023-07-29T15:25:05+05:30 IST