Share News

Madyapradesh: సభలు, ర్యాలీలతో హోరెత్తిన మధ్యప్రదేశ్.. ఏ పార్టీ ఎన్ని సభలు నిర్వహించిందంటే?

ABN , First Publish Date - 2023-11-16T15:55:37+05:30 IST

Bhopal: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. రేపు జరగనున్న పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్(Congress) పార్టీలు పదుల సంఖ్యలో ర్యాలీలు, సభలు నిర్వహించాయి. పార్టీల అగ్రనేతలు వీటిలో పాల్గొని విస్తృతప్రచారం నిర్వహించారు. పార్టీల వారీగా ప్రచారాల లెక్కలు బయటకి వచ్చాయి.

Madyapradesh: సభలు, ర్యాలీలతో హోరెత్తిన మధ్యప్రదేశ్.. ఏ పార్టీ ఎన్ని సభలు నిర్వహించిందంటే?

భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. రేపు జరగనున్న పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్(Congress) పార్టీలు పదుల సంఖ్యలో ర్యాలీలు, సభలు నిర్వహించాయి. పార్టీల అగ్రనేతలు వీటిలో పాల్గొని విస్తృతప్రచారం నిర్వహించారు.

పార్టీల వారీగా ప్రచారాల లెక్కలు బయటకి వచ్చాయి. మధ్యప్రదేశ్(Madyapradesh)లో బీజేపీ(BJP) ఇప్పటివరకు అత్యధికంగా 634 ర్యాలీలు తీసింది. కాంగ్రెస్ 350 ర్యాలీలు నిర్వహించింది. బీజేపీ ర్యాలీల్లో ప్రధాని 15 చోట్ల పాల్గొన్నారు. ప్రతిపక్షంపై ఎక్కువగా విమర్శలు చేసిన వారిలో ప్రధాని మోదీ(PM Modi) అగ్రస్థానంలో నిలిచారు.

ఆ తరువాత బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్కువ ప్రచారం చేసిన వారిలో ఉన్నారు.


బీజేపీ నుంచి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్(Shivraj Singh Chowhan), కాంగ్రెస్ నుంచి మాజీ సీఎం కమల్ నాథ్(Kamalnath) ఒక్కొక్కరు వందకు పైగా ఎన్నికల ర్యాలీలలో ప్రసంగించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రయోజనాలను వివరిస్తూ కాంగ్రెస్ ని లక్ష్యంగా చేసుకుని ప్రధాని మోదీ 15 ర్యాలీలు నిర్వహించారు. రత్లాం, సియోని, ఖాండ్వా, సిధి, దామోహ్, మురైనా, గుణ, సత్నా, ఛతర్‌పూర్, నీముచ్, బర్వానీ, ఇండోర్, బేతుల్, షాజాపూర్, ఝబువాలలో ఆయన ర్యాలీలు జరిగాయి.

హోం మంత్రి షా 21 ర్యాలీల్లో పాల్గొన్నారు. వాటిలో కొన్ని భోపాల్, జబల్‌పూర్, ఖజురహో, గ్వాలియర్‌లలో జరిగాయి. చౌహాన్ 165 ర్యాలీల్లో పాల్గొన్నారు. కొన్ని వారాలుగా, ప్రచారం చివరి రోజున ఎంత అలసిపోయారో ఆయన వివరిస్తూ.. తాను హెలికాప్టర్ దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు కూడా పరిగెత్తినట్లు తెలిపారు. అయినా తాను 165 సభల్లోనే మాట్లాడినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 80 సమావేశాలను నిర్వహించి.. కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా విమర్శలు చేశారు.

బీజేపీ సాధించిన విజయాలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ తరపున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, సచిన్ పైలట్ లు ర్యాలీలు నిర్వహించిన ప్రముఖుల లిస్టులో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి మల్లికార్జున ఖర్గే 9 ర్యాలీలలో పాల్గొనగా.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా చెరో 11 సమావేశాలకు హాజరయ్యారు. రాజ్యసభ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ 50 ఎన్నికల సభల్లో ప్రసంగించారు.

Updated Date - 2023-11-16T15:55:44+05:30 IST